Telugu News » Vijayashanthi : విజయశాంతికి షాకిచ్చిన బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ జాబితా రిలీజ్..!!

Vijayashanthi : విజయశాంతికి షాకిచ్చిన బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ జాబితా రిలీజ్..!!

బీజేపీ(BJP)లో గ్రాండ్ గా చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఊహించని విధంగా ఇటీవల హస్తం గూటి పై వాలారు. అప్పటి నుంచి విజయశాంతి కూడా పార్టీ మారుతారనే ప్రచారం పార్టీ వర్గాలలో జోరుగా సాగుతుంది. ఈ కారణం వల్లనే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మకు చోటు దక్కనట్లుగా సమాచారం.

by Venu

రాములమ్మ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే.. విజయశాంతి (Vijayashanthi) ఒకప్పుడు స్టార్ క్యాంపెయినర్. అంతటి ఫాలోయింగ్ ఉన్న రాములమ్మకి కమలం ఊహించని షాకిచ్చింది. ఈ ఘటన వ్యూహాత్మకంగా జరిగిందా.. ప్లాన్‌తో చేశారో తెలియదు గానీ.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతికి చోటు దక్కలేదు. పైగా ఏ నియోజకవర్గం అభ్యర్థిగా కూడా ప్రకటించలేదు.

ప్రస్తుతం ఈ అంశం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే కాంగ్రెస్‌ (Congress)లో ఒకప్పుడు స్టార్ క్యాంపెయినర్ (Star campaigner)హోదాలో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి.. కాషాయ కండువా కప్పుకుంది. కొన్నాళ్ళు పార్టీలో చురుకుగా వ్యవహరించినా.. గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలు పట్టనట్టుగా ఉంటున్నారు రాములమ్మ.. తాజాగా జరిగిన పరిణామాలతో కమలం విజయశాంతిని పక్కనపెట్టేసిందనే ప్రచారం జరుగుతుంది.

దీనికి కారణం ఈ మధ్య కొందరు సీనియర్లు పార్టీ వీడటం కారణంగా తెలుస్తోంది. బీజేపీ(BJP)లో గ్రాండ్ గా చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఊహించని విధంగా ఇటీవల హస్తం గూటి పై వాలారు. అప్పటి నుంచి విజయశాంతి కూడా పార్టీ మారుతారనే ప్రచారం పార్టీ వర్గాలలో జోరుగా సాగుతుంది. ఈ కారణం వల్లనే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మకు చోటు దక్కనట్లుగా సమాచారం.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున 40 మంది ప్రచారం చేయనున్నారు. వారిలో ప్రధాని నరేంద్ర మోదీ.. జేపీ నడ్డా.. రాజ్‌నాథ్‌ సింగ్‌..
అమిత్‌షా.. నితిన్‌ గడ్కరీ.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప.. కె.లక్ష్మణ్‌..యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్.. పీయూష్ గోయల్‌.. నిర్మలా సీతారామన్‌.. స్మృతి ఇరానీ.. పురుషోత్తం రూపాలా.. అర్జున్‌ ముండా.. భూపేంద్రయాదవ్‌.. కిషన్‌రెడ్డి.. సాధ్వి నిరంజన్‌ జ్యోతి.. ఎల్‌.మురుగన్‌..

ప్రకాశ్‌ జవదేకర్‌.. తరుణ్‌ ఛుగ్‌.. సునీల్ బన్సల్‌.. బండి సంజయ్‌.. అరవింద్‌ మేనన్‌.. డీకే అరుణ.. పి.మురళీధర్‌రావు.. దగ్గుబాటి పురందేశ్వరి.. రవికిషన్‌.. పొంగులేటి సుధాకర్‌రెడ్డి.. జితేందర్‌రెడ్డి.. గరికపాటి మోహన్‌రావు.. ఈటల రాజేందర్‌.. ధర్మపురి అర్వింద్‌.. సోయం బాపూరావు.. రాజాసింగ్‌.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. బూర నర్సయ్యగౌడ్‌.. గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి.. దుగ్యాల ప్రదీప్‌కుమార్‌.. బంగారు శ్రుతి.. కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌.. టి.కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment