Telugu News » Vikarabad : దామగుండం నౌకాదళ రాడార్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు..!

Vikarabad : దామగుండం నౌకాదళ రాడార్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు..!

మూసీ నది పుట్టే ప్రాంతంలోని జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడం తప్పు బాగుచేసింది ఏం లేదని విమర్శించారు. అందుకే 10ఏళ్ల నుంచి తమ ప్రభుత్వం ప్రతిఘటించిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా 10 రోజుల్లేనే కేంద్రానికి లొంగిపోయిందని కేటీఆర్‌ ఆరోపించారు

by Venu
KTR: Congress is a nickname for hypocritical ethics.. KTR's tweet is viral..!

తాము పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు అనేలా బీఆర్ఎస్ ముఖ్య నేతల తీరు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బలిదానాలతో తెచ్చుకొన్న తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బలికాకుండా సర్వ సుఖాలు అనుభవించి కోట్లకు పడగలెత్తిన కారు నేతలు కారు కూతలు కూస్తున్నారానే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ సమయంలో గులాబీ చిన్న బాస్ చేసిన వ్యాఖ్యలు నిప్పుల మీద ఉప్పు చల్లినట్లు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వికారాబాద్‌ (Vikarabad) జిల్లాలో ఏర్పాటు చేసిన రాడార్‌ కేంద్రంతో పర్యావరణం, పక్షులు, జీవవైవిధ్యం దెబ్బతింటుందని, వికారాబాద్‌ జిల్లాకు, పరిగికి నష్టం అయితదనే పదేండ్లు రాడార్‌ను రానివ్వలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. దామగుండంలో కేంద్రం నెలకొల్పుతున్న నౌకాదళ రాడార్ (Naval Radar) వల్ల 3000 ఎకరాల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న 12 లక్షల చెట్లను నరికివేయడం దారుణమైన చర్యగా వర్ణించారు.

ఈ పనితో మూసీ నది పుట్టే ప్రాంతంలోని జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడం తప్పు బాగుచేసింది ఏం లేదని విమర్శించారు. అందుకే 10ఏళ్ల నుంచి తమ ప్రభుత్వం ప్రతిఘటించిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా 10 రోజుల్లేనే కేంద్రానికి లొంగిపోయిందని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్ తరాలను ప్రభావితం చేసే తమ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ట్వీట్ చేశారు.

మరోవైపు కేటీఆర్ ట్వీట్ పై నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రోడ్డు నిర్మాణ సమయంలో 7,800 ఎకరాల్లో ఉన్న అడవిలోని 22 నుంచి 25 లక్షల చెట్లను నరికివేసినప్పుడు మీరేందుకు మౌనంగా ఉన్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘హరిత హారం పేరు మీద మన సాంప్రదాయ మొక్కలను తీసేసి రోడ్డుకి ఇరువైపులా వేరే దేశం వాళ్లు నిషేధించిన విషపూరిత మొక్కలను నాటారు.. మీరు దీని గురంచి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని మరో నెటిజన్ మండిపడ్డాడు. ‘

సిటీ మొత్తం విషపు మొక్కలు నాటి సొల్లు కబుర్లు చెప్తున్నారు. తెలంగాణలో లిక్కర్ నదిని పారించి జనాల్ని మందుబాబుల్ని చేసి లిక్కర్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ట్విట్టర్ టిల్లు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారా భయ్యా.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన మీ చిలుక పలుకులు ఇక ఆపండని ఇలా వరుస ట్వీట్లతో నెటిజన్లు కేటీఆర్ పై విరుచుకుపడుతున్నారు.

You may also like

Leave a Comment