Telugu News » Virat Kohli: రన్‌ మెషీన్‌కు అరుదైన గౌరవం.. ఆ లిస్టులో చోటు..!

Virat Kohli: రన్‌ మెషీన్‌కు అరుదైన గౌరవం.. ఆ లిస్టులో చోటు..!

ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్ జర్నలిస్ట్ 'అలిమో ఫిలిప్'(Alimo Philip) ఎంపిక చేసిన ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ల జాబితా(List of Greatest Athletes of All Time)లో కోహ్లీకి చోటు దక్కింది.

by Mano
Virat Kohli: A rare honor for a run machine.. a place in that list..!

టీమ్ ఇండియా(Team India) రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ‘అలిమో ఫిలిప్'(Alimo Philip) ఎంపిక చేసిన ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ల జాబితా(List of Greatest Athletes of All Time)లో కోహ్లీకి చోటు దక్కింది. ఈ జాబితాలో కింగ్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు.

Virat Kohli: A rare honor for a run machine.. a place in that list..!ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ అథ్లెట్ల జాబితాలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండో స్థానంలో ఉన్నాడు. బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ ఆలీ మూడో స్థానంలో, బాస్కెట్‌బాల్ కింగ్ మైఖేల్ జోర్డన్ నాలుగో స్థానంలో ఉండగా.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐదవ స్థానాన్ని దక్కించుకున్నాడు.

పరుగుల రారాజు ఉసేన్ బోల్ట్ ఆరో స్థానంలో ఉండగా.. అమెరికా మాజీ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ తొమ్మిదవ స్థానంలో ఉంది. టాప్ 10 అథ్లెట్ల జాబితాలో సెరెనా మాత్రమే మహిళ కావడం విశేషం. అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 113 టెస్టులు, 292 వన్డేలు, 117 టీ20 మ్యాచ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

టెస్టులో 8848, వన్డేల్లో 13848, టీ20ల్లో 4037 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 80 సెంచరీలు చేశాడు. మూడు ఫార్మాట్లలో 26,733 రన్స్ బాదాడు. అయితే, అలిమో ఫిలిప్ ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ల జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే కావడం అరుదైన గౌరవం. ‘ఫేస్ ఆఫ్ ద క్రికెట్’గా కోహ్లీని అలిమో ఫిలిప్ అభివర్ణించాడు.

You may also like

Leave a Comment