Telugu News » Visakhapatnam : యువతి ప్రాణం తీసిన కళాశాల ఫ్యాకల్టీ.. కన్నీరు తెప్పిస్తున్న లేఖ..!

Visakhapatnam : యువతి ప్రాణం తీసిన కళాశాల ఫ్యాకల్టీ.. కన్నీరు తెప్పిస్తున్న లేఖ..!

నేటి సమాజంలో చదువు వ్యాపారం కింద మారిపోయింది. పిల్లలను ఉన్నతులుగా తీర్చి దిద్దవలసిన వారు కొందరు అమ్ముడుపోతున్నారు.. మరి కొందరు కామాంధులుగా అవతారం ఎత్తుతున్నారు..

by Venu

బడి, స్కూల్, కాలేజ్, విశ్వవిద్యాలయాలు ఇవేవీ మర మనుషులతో నిండిపోయిన యంత్రాల నివాసాలు కాదు.. బోధన అంటే అమృతాల జలతార.. అది భవిషత్కాల గీతిక.. జ్ఞానకాంతుల దీపిక. మానవత్వపు మాలిక. విజ్ఞానపు వేదిక. తరతరాల శోధిక.. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకొన్న ఆలయంలో ఉన్న ఉపాధ్యాయులు దైవంతో సమానం అంటారు..

కానీ నేటి సమాజంలో చదువు వ్యాపారం కింద మారిపోయింది. పిల్లలను ఉన్నతులుగా తీర్చి దిద్దవలసిన వారు కొందరు అమ్ముడుపోతున్నారు.. మరి కొందరు కామాంధులుగా అవతారం ఎత్తుతున్నారు.. ఇలాంటి దారుణమైన ఘటనలు నిత్యం ఏదో ఒక మూల జరుగుతున్నా.. ప్రపంచానికి తెలిసేవి తక్కువే అని అంటున్నారు.. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకొంది.

కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ (Kommadi Chaitanya Engineering College)లో డిప్లమో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపశ్రీ అనే యువతి కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు భరించలేక శుక్రవారం ఆత్మహత్య (Suicide)కు పాల్పడింది.. కళాశాల భవనం పై నుంచి దూకి మరణించింది. కళాశాల ఫ్యాకల్టీ అసభ్యకరంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడమే తన చావుకు కారణమని ఒక లేఖను సైతం రాసింది. పూర్తి వివరాలు అందులో పేర్కొంది.

తన తండ్రికి రాసిన లేఖలో.. నాన్న నన్ను క్షమించండి.. ఈ విషయం చెప్పవచ్చు కదా అని మీరనుకుంటారు.. ఆ ఫ్యాకల్టీ (Faculty) ఒకరే ఉంటే చెప్పవచ్చు.. కానీ అందరూ ఇలాగైతే ఎవరికి చెప్పగలము నాన్న.. చాలా చెండాలంగా ప్రవర్తిస్తు.. ఫోటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు నాన్న.. స్టూడెంట్స్ కి చెప్పాల్సింది పోయి ఆ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ ని ప్రోత్సహిస్తే ఇంకా ఎవరికి చెప్పాలి నాన్న? నా ఫోటోలు కూడా తీసుకొని బెదిరిస్తున్నారు.

ఇలా నేను ఒక్కదానికే కాదు ఇంకా కాలేజ్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేక అలా అని కాలేజీకి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. ఇదీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాటిని సోషల్ మీడియా లో అప్ లోడ్ చేస్తాం అని బెదిరించారు. ఇంకా నాకు వేరే దారి కనిపించలేదు. ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం ప్రపంచానికి తెలుస్తోంది. అందుకే ఆ పని నేనే చేస్తున్నా.. ఐయామ్ సారి నాన్న.. అంటూ రూప శ్రీ లేఖలో పేర్కొన్నారు. కాగా పీఎం పాలెం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..

You may also like

Leave a Comment