Telugu News » Vladimir Putin: రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఏకపక్ష విజయం..!

Vladimir Putin: రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఏకపక్ష విజయం..!

ఈ సారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ 88శాతం ఓట్లతో ఏకపక్షంగా గెలుపొందారు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది ఐదోసారి. 2030వరకు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు.

by Mano
Vladimir Putin: Russian presidential election.. Putin's unilateral victory..!

రష్యా అధ్యక్షుడి(President of Russia)గా దాదాపు 25 ఏళ్లు అధికారంలో ఉన్న వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఈ సారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ 88శాతం ఓట్లతో ఏకపక్షంగా గెలుపొందారు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది ఐదోసారి. 2030వరకు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు.

Vladimir Putin: Russian presidential election.. Putin's unilateral victory..!

రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(RCEC) ప్రకారం.. పోల్స్ ముగిసిన తర్వాత 24 శాతం ఓట్ల లెక్కింపులో పుతిన్‌కు మద్దతుగా 88 శాతం ఓట్లు పోలయ్యాయని తేలింది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పుతిన్ కీలకంగా వ్యవహరించడం కారణంగా రష్యా ఓటర్లు ఆయన పట్టం కట్టారని తెలుస్తోంది. తన రికార్డు విజయం పుతిన్ ఉక్రెయిన్ సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. రష్యాను బెదిరించడం గానీ, అణచివేయడం గానీ సాధ్యం కాదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ రష్యా, చైనా రెండూ ప్రపంచ స్థాయిలో ఉమ్మడి ప్రయోజనాలను కలిగి ఉన్నాయన్నారు. దీంతో పాటు పుతిన్ విజయం తర్వాత ఓ కీలక ప్రకటన చేశారు. రష్యా ప్రజలు తమ బాధ్యతను గురించి తెలుసుకున్నారని, ఓట్ల శాతం స్పష్టంగా చూపిస్తోందన్నారు. దేశ పౌరుల ప్రయోజనాలను సంరక్షించడానికి కట్టుబడి ఉన్నాయని అభివర్ణించారు. సైన్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

మాస్కో బీజింగ్ తో మాత్రమే సంబంధాలను అభివృద్ధి చేసుకుంటుందని, ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే, అప్పటికే ఉక్రెయిన్ లో నాటో సైనిక సిబ్బంది ఉన్నారని, యుద్ధభూమిలో ఇంగ్లిష్, ఫ్రెంచ్ రెండింటినీ రష్యా తీసుకుందని పుతిన్ అన్నారు. ఇందులో తమకు ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో తనను ఎన్నుకోకపోతే రక్తపాతమే జరుగుతుందంటూ వ్యతిరేక వ్యర్గానికి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment