రష్యా(Russia)లో జననాల రేటు క్రమంగా తగ్గిపోతోంది. జనాభా శాస్త్రవేత్త విక్టోరియా సాకేవిచ్ ప్రకారం.. జననాల రేటు తగ్గడం ఆందోళనకు గురిచేస్తోంది. 1990ల నుంచి రష్యాలో అబార్షన్ రేటు దాదాపు పదిరెట్లు పడిపోయింది. దీంతో రష్యన్ అధికారులు అప్రమత్తమయ్యారు. అబార్షన్లను తగ్గించే దిశగా చర్యలు చేపట్టారు. అబార్షన్ల వల్ల జనన రేటు పెరగదని జనాభాను మెరుగుపరచడం తమ లక్ష్యం అని చెబుతున్నారు.
మాస్కో సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladmir Putin) మాట్లాడుతూ మహిళలు పెద్ద కుటుంబాలను ఆలింగనం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. తగ్గుతున్న జనన రేటును ఎదుర్కోవటానికి ఎనిమిది మంది పిల్లల వరకు కనాలని సూచించారు. ఆంక్షల కారణంగా తీవ్రమైన శ్రామిక శక్తి కొరత, ఆర్థిక మందగమనానికి దారితీసిన ఉక్రెయిన్ యుద్ధం వల్ల జనాభా తగ్గడం తమ ముందున్న సవాల్ అని పుతిన్ తెలిపారు.
సంపూర్ణ అబార్షన్ నిషేధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్లో ఉన్న ప్రస్తుత రష్యా దళాలకు అదనపు సైనిక సమీకరణలు అనవసరమని పుతిన్ పేర్కొన్నారు. మహిళలు పిల్లల ప్రాణాలను కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలను కనేందుకు తమ పౌరులకు ఆర్థికంగా ప్రోత్సాహకం ఇచ్చేందుకు రష్యా ప్రభుత్వం సిద్ధమైంది.
ఇంకా రష్యన్ ఆర్మీలో రిక్రూట్మెంట్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కానీ బుధవారం సాయంత్రం నాటికే రష్యా సైన్యంలో 4,86,000 మంది సైనికులు చేరారని, అదనంగా రోజుకు 1500మంది చేరుతున్నట్లు పుతిన్ వెల్లడించారు. మరోవైపు ఆర్థడాక్స్ చర్చి అధికారులు కూడా అబార్షన్లను అరికట్టాలని రష్యా అధికారులను కోరుతున్నారు. దేశం యుద్ధంలో ఉన్న సమయంలో అబార్షన్లు సహజమని, ఇంట్లో కూర్చొని పిల్లలకు జన్మనివ్వాలని జార్జియాలో ఉన్న రష్యన్ ఫెమినిస్ట్ కార్యకర్త లెడా గరీబా సందేశమిచ్చారు.