Telugu News » VV-Vinayak : పాలిటిక్స్‌లోకి స్టార్ డైరెక్టర్.. ఎంపీగా ఆ పార్టీ నుంచి పోటీ..!?

VV-Vinayak : పాలిటిక్స్‌లోకి స్టార్ డైరెక్టర్.. ఎంపీగా ఆ పార్టీ నుంచి పోటీ..!?

వైసీపీలో మరింత సినీ గ్లామర్ యాడ్ చేసేందుకు సీఎం జగన్‌ (Jagan) ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ (VV-Vinayak)ను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

by Venu
vvvinayak

ఆంధప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఎన్నికల వేళ రాజకీయాలు రంజుగా మారాయి. వైసీపీ (YCP)కి ధీటుగా టీడీపీ (TDP).. టీడీపీకి ధీటుగా వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారని అనుకొంటున్నారు.. ఇదే సమయంలో కొందరు టికెట్ కోసం అధిష్టానాల వద్ద పైరవీలు స్టార్ట్ చేశారు. మరోవైపు టీడీపీకి పవన్ సినీ గ్లామర్ ఎలాగో ఉంది. వైసీపీలో రోజా పాతుకుపోయిన విషయం తెలిసిందే.. వీరిద్దరూ తప్పితే పెద్దగా సినిమా గ్లామర్ ప్రస్తుతం ఏపీలో కనిపించడం లేదు..

vvvinayak

 

ఇదిలా ఉండగా.. వైసీపీలో మరింత సినీ గ్లామర్ యాడ్ చేసేందుకు సీఎం జగన్‌ (Jagan) ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ (VV-Vinayak)ను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కు ధీటుగా సినీ గ్లామర్‌ను జోడించడంతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వినాయక్‌ను రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోందనే టాక్ బలంగా ఉంది.

మరోవైపు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వినాయక్‌ కు గ‌తంలో వైసీపీ నాయ‌కుల‌తో మంచి సంబంధాలుండేవి. ఈ నేపథ్యంలో జగన్ ఈ డైరెక్టర్ గ్లామర్ పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వినాయ‌క్ సినిమాలంటే భూమిలో నుంచి గాల్లోకి సుమోలు లేవ‌డం సాధార‌ణం. గొప్ప ఎలివేష‌న్స్ సీన్స్ తో సూప‌ర్‌హిట్ సినిమాలు తీసిన వినాయ‌క్.. రాజ‌కీయాల్లో ఎలాంటి రికార్డ్ సృష్టిస్తారో చూడాలి.. అయితే వీవీ వినాయక్‌ రాజకీయ ఎంట్రీ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వినాయక్‌.. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా వైసీపీ తరపున ప్రచారం చేస్తారో లేడో అని సందేహం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోందంటున్నారు. అదీగాక గతంలో సైతం ఈ దర్శకుడి ఎంట్రీ పై ఇలాగే వార్తలు వచ్చాయి.. ఇప్పుడు మరోసారి ప్రచారం జరుగుతోంది. అందుకే పూర్తిగా క్లారిటీ వచ్చేవరకు వినాయ‌క్ రాజకీయ ఎంట్రీ రహాస్యమే అంటున్నారు..

You may also like

Leave a Comment