Telugu News » Vyuham Movie: వ్యూహం సినిమాపై హైకోర్టు విచారణ.. జరిగిందిదే..!

Vyuham Movie: వ్యూహం సినిమాపై హైకోర్టు విచారణ.. జరిగిందిదే..!

వ్యూహం సినిమాకు యూ/ఏ(U/A) సర్టిఫికెట్ జారీ కావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌‌పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) విచారణ చేపట్టింది.

by Mano
Vyuham Movie: The High Court's investigation on the movie Strategy.. has happened..!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) తాజాగా తెరకెక్కించిన సినిమా ‘వ్యూహం’(Vyuham). ఈ సినిమా ఈనెల 29న విడుదల కావాల్సివుంది. అయితే ఈ సినిమాకు యూ/ఏ(U/A) సర్టిఫికెట్ జారీ కావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు టీడీపీ.. తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేసింది.

Vyuham Movie: The High Court's investigation on the movie Strategy.. has happened..!

ఈ పిటిషన్‌పై ఇవాళ(మంగళవారం) నేడు హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. టీడీపీ తరఫున న్యాయవాది మురళీధర్ రావు వాదనలు వినిపించారు. వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ అజెండాగా రూపొందించారని తెలిపారు.. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీఫేం చేసినట్లు ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు.

వ్యూహం సినిమాకు ప్రొడ్యూసర్‌ అడ్రస్ కూడా వైసీపీకి చెందిన కార్యాలయం పేరుపై ఉందని కోర్టుకు మురళీధర్‌రావు వివరించారు. బహిరంగగానే చంద్రబాబు, పవన్ తనకు ఇష్టం లేదని ఈ సినిమా ప్రీ రిలీజ్‌లో ఆర్జీవీ చెప్పారని, ఆ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులూ హాజరయ్యారని తెలిపారు. వ్యూహం సినిమా మొత్తం చంద్రబాబును కించపరచడానికే తీశారని చెప్పారు. సినిమా ట్రైలర్, పాటలను పెన్ డ్రైవ్‌లో మురళీధర్‌రావు హైకోర్టుకు సమర్పించారు.

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా ఈ సినిమాను రూపొందించారని, ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం తీవ్రంగా ఉంటుందని మురళీధర్‌రావు తెలిపారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను వెంటనే రద్దు చేయాలని కోర్టును కోరారు. ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ పేరుతో డీ ఫేమ్‌కు పాల్పడటం సరికాదని, దానికి ఒక హద్దు ఉంటుందని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment