ఒక రోజు ఇల్లు శుభ్రం చేయకపోతే…ఇది మనిల్లేనా అనిపిస్తుంది. అలాంటిది నలుగురు తిరిగే ప్రదేశాన్ని రోజులు తరబడి శుభ్రం చేయకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి..!? ముక్కులు మూసుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.
తర్వాత అపరిశుభ్ర వాతావరణం కారణంగా వచ్చే వ్యాధులు, వాటి తాలుకు బాధలు, అయ్యే ఖర్చులు.. అబ్బో ఇక చెప్పేదేముంది. ఒకసారి ఆలోచించండి.!? మనం నమిలి నమిలి బాధ్యతలేకుండా ఉమ్మేసే పాన్ పరాగ్ పెయింటు.
విసిరేసే అరటి పండు తొక్క, తాగి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు(plastic Bottles) బాధ్యతగా ఎక్కడ వెయ్యాలో అక్కడ వేయడం ద్వారా మన వంతు పరిశుభ్ర ప్రదేశాలను మనం సృష్టంచలేమంటారా…!? ఇది మనం మారలేనంత, మార్చలేనంత కష్టమంటారా..!? కాదు కానే కాదు.!?
వ్యర్థాలను కూడా సమర్ధంగా ఉపయోగించవచ్చు..ముఖ్యంగా నగరాల్లో ఇబ్బడి ముబ్బడిగా కనిపించే ప్లాస్టిక్ తో అద్భుతాలు చేయవచ్చు.దీనికి కావలసిందల్లా చిత్తశుద్ధి, ప్రభుత్వాలకు, ప్రజలకూ మధ్య సమన్వయం, సహృదయం, సాధించాలనే సంకల్పం. సూరత్ నగరం అదే చేసింది.
ప్లాస్టిక్ వ్యర్ధా( plastic wastage)లపై పంజా విసిరింది. ప్లాస్టిక్ వ్యర్థాలను దారాలుగా మార్చింది..ఆ దారాలను బట్టలుగా కూర్చేందుకు విదేశాలకు ఎగుమతి చేస్తోంది. వ్యర్ధాలను ఆదాయ మార్గంగా మార్చింది. ఐదు సంవత్సరాలుగా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది.
ప్రస్తుతం సూరత్ (Surratt)భారతదేశంలోనే రెండవ అతిపెద్ద పర్యావరణ అనుకూల నూలు తయారీ నగరంగా మారింది. “వేస్ట్ టూ వేర్ “ దిశగా సూరత్ సాధించిన ప్రగతి..తయారు చేస్తున్న నూలు దారాల గురించి తెలుసుకుందాం. సూరత్‌లో గత ఐదు సంవత్సరాల నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single use plastic) బాటిళ్లను నూలుగా మారుస్తోంది.
ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన నూలు(fabric)కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. సూరత్‌లోని మూడు కంపెనీలు ఈ తరహా నూలును తయారు చేస్తున్నాయి. ఇది 600 కోట్లకు పైగా బాటిళ్లను చూర్ణం చేస్తుంది. ప్రతి సంవత్సరం 1,56,000 టన్నుల ఫైబర్‌ను ఉత్పత్తి చేస్తోంది.
అసలు ఈ నూలును ఎలా తయారు చేస్తారు. దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. తొలుత ప్లాస్టిక్ సీసాలు సేకరించి పూర్తిగా కడుగుతారు. అప్పుడు దాని నుండి రేకులు తయారు చేస్తారు.
ఈ రేకుల నుండి నూలు తయారు చేస్తారు. నూలు తయారు చేసే మొత్తం ప్రక్రియలో నీటిని ఉపయోగించరు. కాబట్టి ఈ నూలు తయారీలో నీటిని ఆదా చేసే పని కూడా జరుగుతుంది.
సూరత్‌లో తయారయ్యే ఈ రకం నూలుకు విదేశాల్లోనూ మంచి గిరాకీ(Demand) ఉంది. ఈ కంపెనీ సూరత్‌లోని ప్లాస్టిక్ బాటిళ్ల నుండి నెలకు ఐదు నుండి ఆరు టన్నుల ఫైబర్‌ను ఉత్పత్తి చేస్తుందట.
మార్కెట్‌లో లభించే బట్టలను రీసైక్లింగ్ చేసేటప్పుడు ట్యాగ్‌లు ఇస్తారు. అప్పుడు ఈ రకమైన వ్యర్థాలను ఉపయోగించి గుడ్డను తయారు చేస్తారు. ఈ సీసా నుంచి ఉత్పత్తి అయ్యే నూలుతో పాలిస్టర్ ఫాబ్రిక్ తయారు చేస్తారు.
ఇది కాకుండా, ఈ ఫాబ్రిక్ హోమ్ ఫర్నిషింగ్ ఫాబ్రిక్(Fabric Home Furnishing Fabric), ఆటోమొబైల్(Auto mobile) బైక్, కార్ కవర్లకు(Car covers) కూడా ప్రసిద్ధి చెందింది. ఈ బట్టలు మన్నికైనవి కాబట్టి, దీర్ఘకాల ఉపయోగం కోసం ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
మరియు పర్యావరణానకి కూడా ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. ఇలా ఒక సూరత్ లోనే కాకుండా దేశంలోని ముఖ్య నగరాలు ప్రయత్నిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.