Telugu News » Weather Alert: బీ అలర్ట్.. ఈ నెల నుంచే వడగాల్పులు..!!

Weather Alert: బీ అలర్ట్.. ఈ నెల నుంచే వడగాల్పులు..!!

భారత వాతావరణ శాఖ(IMD) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు(Temperature) భారీగా పెరగనున్నాయని వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రం(Pacific Ocean)లో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎల్ నినో(El Nino) పరిస్థితులు వేసవి చివరి వరకూ కొనసాగనున్నాయి.

by Mano
Weather Alert: Be alert.. Hailstorm from this month..!!

అసలు ఈఏడాది శీతాకాలం వచ్చిందా? రాలేదా? అన్నట్లు మారింది వాతావరణ పరిస్థితి. ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ(IMD) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు(Temperature) భారీగా పెరగనున్నాయని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది.

Weather Alert: Be alert.. Hailstorm from this month..!!

భూమధ్య రేఖకు ఆనుకుని పసిఫిక్ మహాసముద్రం(Pacific Ocean)లో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎల్ నినో(El Nino) పరిస్థితులు వేసవి చివరి వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పసిఫిక్ లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉన్నాయి. దీంతో మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.

దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. జూన్ నుంచి తటస్థ పరిస్థితులు ప్రారంభమై ఆగస్టు నాటికి లానినా మొదలవుతుందని ఐఎండీ అంచనా. నైరుతి రుతుపవనాల సీజన్ రెండో భాగం అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ఇక మార్చి నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. మార్చి నుంచి మే వరకూ దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. దీంతోపాటు వడగాడ్పులు వీచే రోజుల సంఖ్యా ఎక్కువ కానున్నాయి.

You may also like

Leave a Comment