Telugu News » PM MOdi : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు… మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక వ్యూహం అదేనా…..!

PM MOdi : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు… మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక వ్యూహం అదేనా…..!

సముద్రం ఒడ్డున వాకింగ్ చేస్తూ ఆహ్లాదాన్ని పొందారు. పనిలో పనిగా సముద్రంలో స్నార్కెలింగ్ చేసి తనలో సాహస యాత్రికున్ని బయటకు తీశారు.

by Ramu
Big step taken By maldives government over hatefull remarks on PM Modi

లక్ష ద్వీప్‌ (Lakshadweep)లో ప్రధాని మోడీ (PM Modi) రెండు రోజుల పాటు పర్యటించారు. అక్కడి దీవుల్లో ఉన్న ప్రకృతి అందాలను చూసి మైమరిచి పోయారు. సముద్రం ఒడ్డున వాకింగ్ చేస్తూ ఆహ్లాదాన్ని పొందారు. పనిలో పనిగా సముద్రంలో స్నార్కెలింగ్ చేసి తనలో సాహస యాత్రికున్ని బయటకు తీశారు. ఇదంతా చూస్తుంటే ప్రధాని మోడీ లక్షద్వీప్‌లో హాలీడే ఎంజాయ్ చేసేందుకు వెళ్లినట్టు కనిపిస్తోంది. కానీ ప్రధాని మోడీ ఈ ఫోటోలు విడుదల చేయం వెనుక పెద్ద రహస్య ప్రణాళికే ఉన్నట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ప్రపంచంలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న నేతల్లో ప్రధాని మోడీ ఒకరు. ఆయన వేసే ప్రతి అడుగును అటు ప్రతి పక్షాలు, ఇటు ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాయి. నిత్యం ఏదో పనిలో బిజీగా ఉండే మోడీ ఇంత ప్రశాంతంగా లక్ష్యద్వీప్‌లో పర్యటించడంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక పెద్ద కారణం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రధాని మోడీ టూరిజం ప్రమోషన్ :
2021లో కరోనా మహమ్మారి విజృంభించింది. ఆ సమయంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో చాలా మంది పర్యటనలను వాయిదా వేసుకున్నారు. దీంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో 2014లో పర్యాటక రంగానికి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు మోడీ నిర్ణయించారు. ఈ క్రమంలోనే కశ్మీర్ లోని టులిప్ గార్డెన్ అందాలను వర్ణిస్తూ ట్వీట్స్ చేశారు. టులిప్ గార్డెన్ అందాలను ఎంజాయ్ చేయండంటూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ కు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. తాజాగా లక్ష ద్వీప్‌లో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

PM Modi goes snorkelling in Lakshadweep enjoys pristine beaches

లక్షద్వీప్ vs మాల్దీవులు :

లక్ష ద్వీప్, మాల్దీవులకు చాలా అంశాల్లో పోలీకలు ఉన్నాయి. మాల్దీవుల్లో ఉన్నట్టుగానే లక్ష ద్వీప్ లో కూడా లాగూన్లు, వర్జిన్ బీచ్‌లు, పగడపు దీవులు ఇలా చాలా ఉన్నాయి. ఈ దీవుల్లో సందర్శనలపై పరిమితులు ఉండటం, అనుమతుల ప్రక్రియ గజిబిజిగా ఉండటం, ఈ ప్రాంతం గురించి పెద్దగా ప్రచారం లేకపోవడం వంటి అంశాల వల్ల లక్ష ద్వీప్ ను చాలా తక్కువ మంది సందర్శిస్తు ఉన్నారు. 2021లో ఈ దీవులను సందర్శించిన పర్యాటకుల సంఖ్య 4వేలు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది.

తలనొప్పిగా మారుతున్న మాల్దీవులు :
మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల అనంతరం పరిస్థితులు మారి పోయాయి. తాము పూర్తి స్వతంత్ర్యంగా ఉండాలని భావిస్తున్నామని నూతన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తెలిపారు. తమ ద్వీపంలో మోహరించిన భారత సైన్యాలు వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే సముద్ర మార్గం ఇక్కడే ఉంది. ఇక్కడ డ్రాగన్ కంట్రీ రహస్య కార్యకలాపాలకు పాల్పడితే భారత్ భద్రతపై పెను ప్రభావం పడుతుంది. అందుకే మాల్దీవులను కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది.

మాల్దీవులకు చెక్ పెట్టే యోచన:

లక్షద్వీప్ తో పోలిస్తే ఎక్కువ మంది మాల్దీవుల పర్యటకు వెళ్తున్నారు. 2021-22లో మాల్దీవులను పర్యాటక రంగానికి భారత్ నుంచే అధిక ఆదాయం వచ్చింది. 2021లో 2.91 లక్షల మంది, 2022లో 2.41 లక్షల మంది భారత పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. మార్కెట్ షేర్ లో ఇది 23, 14.4 శాతాలుగా ఉంది. ఈ క్రమంలో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే ఫార్ములాను మోడీ సర్కార్ అమలు చేస్తోంది. భారత పర్యాటకులను లక్షద్వీప్ కు మళ్లించి భారత్ పర్యాటక రంగ ఆదాయాన్ని పెంచాలి, అటు మాల్దీవుల పర్యాటక రంగాన్ని దెబ్బ కొట్టవచ్చన్నది మోడీ సర్కార్ ఆలోచన అని సమాచారం.

లక్షదీవుల కోసం గూగుల్‌లో భారీగా సెర్చింగ్ :

ప్రధాని మోడీ బుధవారం లక్ష ద్వీప్‌లో పర్యటించారు. అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ సాహసయాత్రికులు తమ జాబితాలో చేర్చుకోవాల్సిన ప్రాంతాల్లో లక్షద్వీప్ అంటూ సూచనలు చేశారు. దీంతో అంతా లక్ష ద్వీప్ గురించి గూగుల్ లో సెర్చ్ చేశారు. నిన్న ఒక్క రోజే సుమారు 50000 మంది సెర్చ్ చేశారు. ఆ రోజు అత్యధికులు సెర్చ్ చేసిన తొమ్మిదవ పదంగా లక్షద్వీప్ నిలిచింది. దీంతో లక్షద్వీప్ ఇప్పుడు ట్రెండింగ్ పదంగా మారింది.

You may also like

Leave a Comment