Telugu News » Wings India 2024: బేగంపేట ఎయిర్‌పోర్టులో వైమానిక ప్రదర్శనలు షురూ.. ఎన్ని రోజులంటే..!!

Wings India 2024: బేగంపేట ఎయిర్‌పోర్టులో వైమానిక ప్రదర్శనలు షురూ.. ఎన్ని రోజులంటే..!!

'ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024'వైమానిక ప్రదర్శనలు షురూ అయ్యాయి. బేగంపేట ఎయిర్ పోర్ట్‌ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమాన్ని గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.

by Mano
Wings India 2024: Air shows to start at Begumpet Airport.. How many days..!!

హైదరాబాద్‌(Hyderabad)లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024′(International Wings India 2024) వైమానిక ప్రదర్శనలు షురూ అయ్యాయి. బేగంపేట ఎయిర్ పోర్ట్‌ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమాన్ని గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏవియేషన్ రంగనిపుణులు పాల్గొన్నారు.

Wings India 2024: Air shows to start at Begumpet Airport.. How many days..!!

 

వింగ్స్ ఇండియా ప్రదర్శన కోసం పలు విమానాలు ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. మొత్తం 25 రకాల విమానాల ప్రదర్శన ఉంటుంది. 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం జనవరి 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది.

20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. వింగ్స్ ఇండియా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు పూర్తి ఉచితం. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు వింగ్స్ ఇండియా 2024 జరగనుంది.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఏవియేషన్‌ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ దేశంలోనే ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వారంలో మూడు సార్లు విమానం వేయాలని జ్యోతిరాదిత్య సింధియాను కోరినట్లు తెలిపారు. ఎయిర్ అంబులెన్స్‌లు ఎక్కువగా హైదరాబాద్ వస్తున్నాయి. ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలం. డ్రోన్ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నాం’ అని కోమటిరెడ్డి తెలిపారు.

You may also like

Leave a Comment