మంత్రి కేటీఆర్ (KTR) , బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మధ్య డైలాగ్ వార్ నడిచింది. మొదట దేశంలోనే మోస్ట్ అన్ ఫిట్ లీడర్ (Unfit Leader) కిషన్ రెడ్డి అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి గురించి మాట్లాడటం కూడా వేస్టు అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ సర్కార్ పంపిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరస్కరించడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కేటీఆర్ జాగీరు కాదని కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
షాడో సీఎం లాగా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తండ్రిని అడ్డు పెట్టుకుని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ సర్టిఫికేట్ తనకేమీ అక్కర్లేదన్నారు.
కేసీఆర్ కుటుంబానికి ఏజెంట్లుగా పని చేసే వాళ్లను, ఆయనకు కొమ్ము కాసే వాళ్లను, పార్టీ పిరాయింపు దారులను గవర్నర కోటాలో ఎమ్మెల్సీలుగా చేయాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.