Telugu News » Warm up Tickets : వరల్డ్ కప్ వార్మప్ కు రంగం సిద్ధం..బుక్ మైషోలో టికెట్స్..లభ్యం.!!

Warm up Tickets : వరల్డ్ కప్ వార్మప్ కు రంగం సిద్ధం..బుక్ మైషోలో టికెట్స్..లభ్యం.!!

వరల్డ్ కప్ క్రికెట్ సంగ్రామానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ సారి భారత్ ఆతిథ్య దేశం కావడంతో మన క్రికెట్ అభిమానుల్లో మరింత ఉత్సాహం వచ్చిచేరింది

by sai krishna

వరల్డ్ కప్ క్రికెట్ సంగ్రామానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ సారి భారత్ ఆతిథ్య దేశం కావడంతో మన క్రికెట్ అభిమానుల్లో మరింత ఉత్సాహం వచ్చిచేరింది.అయితే అలరించే వినోదానికి మరో నలభైరోజుల అడ్డుతెర ఉంది.

ప్రపంచ క్రికెట్ వీరులు మనదేశానికి తరలి రాబోతున్నారు. కనువిందైన క్రికెట్ యుద్ధానికి ఆటగాళ్లు సన్నద్ధమయ్యే వామ్ అప్ మ్యాచ్ లు కూడా ఉత్కంఠను,వినోదాన్ని,అంతిమ విజేతను ఊహించేందుకు ఓ అంచనాని కలిగిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.


అలాంటి సన్నాహక మ్యాచ్ లను తిలకించే జౌత్సాహిక క్రికెట్ అభిమానులకోసం బీసీసీఐ(BCCI)టికెట్స్ ను అందుబాటులోకి తెచ్చింది. 10 జట్లు పాల్గొనే వార్మప్‌ మ్యాచ్‌ల(Warm up matches) షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం(23.08.23)విడుదల చేసిన సంగతి తెలిసిందే.

టోర్నీలో సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 3 వరకు వార్మప్ మ్యాచులు..హైదరాబాద్, తిరువనంతపురం (Thiruvananthapuram), గువహటి(Guwahati)వేదికగా జరగనున్నాయి.భారత్‌ తమ తొలి వార్మాప్‌ మ్యాచ్ను సెప్టెంబర్‌ 30న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్(England)తో గువహటి వేదికగా ఆడనుంది.

అయితే ఈ ప్రపంచ కప్‌ కోసం ‘బుక్‌ మై షో’ను తమ టికెటింగ్‌ భాగస్వామిగా బీసీసీఐ అనౌన్స్ చేసింది. ప్రధాన మ్యాచ్‌లు, వార్మప్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను ఈ బుక్‌ మై షో ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేయొచ్చని తెలిపింది.టీమ్ఇండియా మినహా ఇతర జట్ల వార్మప్ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు ఈ నెల రేపటి(ఆగస్ట్ 25) నుంచి అందుబాటులో ఉండనున్నాయని తెలిపింది.ఇండియాకు సంబంధించిన మ్యాచ్ల టికెట్లు ఆగస్ట్ 30 నుంచి అందుబాటులో ఉంటాయి.

అయితే బోర్డు స్పాన్సర్లలో ఒకరైన మాస్టర్‌ కార్డ్‌ వినియోగదారులకు మాత్రం ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. ఒకరోజు ముందుగానే(ఆగస్ట్ 24 సాయంత్రం 6 గంటల నుంచే) టికెట్లు అందుబాటులో ఉంటాయి. టీమ్ఇండియా ఆడే మ్యాచుల టికెట్లు ఆగస్ట్ 29 సాయంత్రం 6 గంటల నుంచే ఉంటాయి.

టీమ్ఇండియా ఆడే వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు ఈ నెల 30 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అలాగే టీమ్ఇండియా ఆడే ప్రధాన టోర్నీ మ్యాచ్‌ టికెట్లను నాలుగు ధపాలుగా విడుదల చేయనున్నారు.

చెన్నై, దిల్లీ, పుణెలో టీమ్ ఇండియా ఆడే మ్యాచ్‌లకు ఆగస్టు 31 రాత్రి 8నుంచి నుంచి, ధర్మశాల, లఖ్నవూ, ముంబయిలో ఆడే మ్యాచ్‌లకు సెప్టెంబర్‌ 1 రాత్రి 8నుంచి నుంచి, బెంగళూరు, కోల్‌కతాలో ఆడే మ్యాచ్‌లకు సెప్టెంబర్‌ 2 రాత్రి 8నుంచి నుంచి లభ్యం అవుతున్నాయి.

అహ్మాదాబాద్లో జరిగే టీమ్ఇండియా మ్యాచ్కు మాత్రం సెప్టెంబర్ 3 రాత్రి 8నుంచి టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. సెమీఫైనల్, ఫైనల్‌కు సంబంధించిన టికెట్లను సెప్టెంబర్‌ 15 రాత్రి 8 నుంచి అందుబాటులో ఉంటాయి. బీసీసీఐ విడుదల చేయనుంది. మాస్టర్ కార్డ్ ఉన్నవారికి సెప్టెంబర్ 14 సాయంత్రం 6 గంటల నుంచే ఉంటాయి.

You may also like

Leave a Comment