Telugu News » Powerful Passports : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు ఆ దేశానిదే..!

Powerful Passports : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు ఆ దేశానిదే..!

ఈ జాబితాలో ఫ్రాన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్, సింగపూర్‌లు అగ్రస్థానాన్ని పంచుకున్నాయి.

by Ramu
Worlds most powerful passports 2024 Where does India stand

ప్రపంచంలోనే అత్యంత శక్తవంతమైన పాసు పోర్టుల (Powerful Passports) జాబితాను హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ (Henley Passport Index) విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్, సింగపూర్‌లు అగ్రస్థానాన్ని పంచుకున్నాయి. ఆయా దేశాల పాసుపోర్టుతో ఎలాంటి వీసా లేకుండానే 194 దేశాల్లో పర్యటించవచ్చు.

Worlds most powerful passports 2024 Where does India stand

ఈ జాబితాలో భారత్ పాసుపోర్టు 85వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే వీసా లేకుండా తమ దేశాల్లో భారతీయులను అనుమతించే దేశాల సంఖ్య 60 నుంచి 62కు పెరిగింది. అయినప్పటికీ ఈ జాబితాలో భారత్ పాసుపోర్టు స్థానం కిందకి పడిపోవడం గమనార్హం. ఇక దాయాది పాక్ గతేడాది లాగానే ఈ సారి కూడా 106వ స్థానంలో నిలిచింది.

ఎలాంటి వీసా లేకుండానే పాక్ పౌరులు 34 దేశాల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంది. ఇక పొరుగు దేశం బంగ్లాదేశ్ గతంతో పోలిస్తే ఒక స్థానం కిందకి పడిపోయింది. గతేడాది ఈ జాబితాలో బంగ్లాదేశ్ 101 వస్థానంలో ఉండగా, ఈ ఏడాది 102వ స్థానానికి పడిపోయింది. ఇక మాల్దీవులు ఈ జాబితాలో 58వ స్థానంలో ఉంది.

ఇక సౌదీ అరేబియా రెండు స్థానాలు మెరుగు పరుచుకుంది. గతేడాది సౌదీ అరేబియా ఈ జాబితాలో 65 వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 63వ స్థానానికి ఎగబాకింది. అటు డ్రాగన్ కంట్రీ కూడా ఈ జాబితాలో రెండు స్థానాలు మెరుగు పరుచుకుంది. గతేడాది చైనా 66 నుంచి 64వ స్థానానికి చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికా గతంతో పోలిస్తే ఏడు నుంచి ఆరవ స్థానానికి చేరింది.

You may also like

Leave a Comment