Telugu News » WWII era letter: బయటపడిన 2వ ప్రపంచ యుద్దం నాటి లేఖ… వెలుగులోకి సంచలన విషయాలు…!

WWII era letter: బయటపడిన 2వ ప్రపంచ యుద్దం నాటి లేఖ… వెలుగులోకి సంచలన విషయాలు…!

రెండో ప్రపంచ యుద్దం కాలం నాటి లేఖ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

by Ramu
WWII-era letter suggests Vatican knew of Holocaust atrocities

రెండో ప్రపంచ యుద్దం(second world war) కాలం నాటి లేఖ(letter) ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ(Germany) ఆక్రమిత పోలాండ్‌(poland)లో 6వేల మంది యూదులు, పోలాండ్ పౌరులను నాజీలు ఊచకోత కోశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అప్పటి పోప్ పియాస్-12(pope) కు తెలుసని ఆ లేఖ ద్వారా తెలుస్తోంది.

WWII-era letter suggests Vatican knew of Holocaust atrocities

ఈ లేఖను రెవ. లోథర్ కోయినిగ్ అనే జర్మన్ జెస్యూట్ పూజారి పోప్ సెక్రటరీ రెవ. రాబర్ట్ లీబర్‌కు డిసెంబర్ 14, 1942న రాసినట్టు తెలుస్తోంది. పోలాండ్ లో సుమారు 6వేల మందిన పోలాండ్, యూదులను ఊచ కోస్తున్నట్టు ఆ లేఖలో వెల్లడించారు. ఆ లేఖ వాటికన్ ఆర్క్వైవ్‌లో లభించగా దాన్ని ఇటలీకి చెందిన ఓ పత్రిక ప్రచురించింది.

ఇప్పటికే పియాస్ విషయంలో చరిత్ర కారులు రెండుగా విడిపోయారు. యూదుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన దౌత్య విధానంలో ఆయన ప్రయత్నించారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఇక యూదులపై ఊచకోత విషయంలో ఆయన మౌనంగా వున్నారని విమర్శకులు అంటున్నారు. ఈ క్రమంలో తాజా లేఖ బయటకు రావడంతో మరోసారి చర్చకు తెరలేపింది.

వాటికన్ ఆర్కైవిస్ట్ గియోవన్నీ కోకో దీనిపై మాట్లాడుతూ…. ఈ లేఖ చాలా ముఖ్యమైందన్నారు. ఇది ఒక ప్రత్యేకమైన సందర్బమన్నారు. ఎందుకంటే పోలాండ్‌లో లేబర్ క్యాంపులు వాస్తవానికి మరణ కర్మాగారాలుగా మారిపోయానని వాటికన్‌కు పోప్ కు సమాచారం ఉందని లేఖ ద్వారా తెలుస్తోందని వెల్లడించారు.

మరోవైపు రెవ. లోథర్ కోయినిగ్ రాసిన లేఖ ప్రాముఖ్యతను సంతరించుకుందని ఆంథ్రోపాలజిస్టు డేవిడ్ కెర్ట్‌జెర్ తెలిపారు. పోలాండ్‌లో మొదటిసారిగా యూదుల దాడి గురించి వచ్చిన రెఫరెన్స్ లెటర్ గా దాన్ని ఆయన అభివర్ణించారు. అయితే పోప్ పియాస్-12 ఆ లేఖను చూసి చదివారా లేదా అన్న సందేహం తలెత్తుతోందని మరికొందరు అంటున్నారు.

You may also like

Leave a Comment