ఏపీలో రాజధాని, ప్రత్యేక హోదా అంశం మరోసారి హాట్ టాపిగ్‌గా మారింది. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి( YCP leader YV Subbareddy) మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజధాని కన్ఫామ్ అయ్యేవరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జూన్‌తో పదేళ్లు పూర్తవుతుందని గడువు ముగియనుంది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి రాజధాని గడువును మరికొద్ది రోజులు పొడిగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
జాన్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామమని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీలో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తికాలేదని తెలిపారు. పైగా ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని తెలిపారు. వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభలో ప్రస్తావిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.
ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సుబ్బారెడ్డి అన్నారు. ఏపీకి కొత్త రాజధాని విశాఖపట్నం ప్రకటించేంత వరకూ హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించాలన్నారు. తాము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయపరమైన వివాదాలతో మూడు రాజధానుల అంశం పెండింగ్‌లో ఉందని, ఆ వివాదం పూర్తయ్యే వరకూ హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరారు.