చాలామంది ఇప్పటికి కూడా ప్రేమ లేఖలు రాసుకుంటున్నారు ఫోన్లు వచ్చినా టెక్నాలజీ పూర్తిగా అభివృద్ధి చెందుతున్న చాలామంది అక్కడక్కడా ఇంకా ప్రేమ లేఖల్ని రాసుకుంటున్నారు. వాళ్ళ ప్రేయసితో ప్రియుడుతో వాళ్ల ఫీలింగ్స్ ని ప్రేమలేఖల ద్వారా పంచుకుంటున్నారు. ఒకప్పుడు ఫోన్ లేకపోయినప్పుడు ప్రేమలేఖల్ని ఎక్కువగా రాసేవారు ఇప్పుడు తగ్గింది కానీ అక్కడక్కడ ఇంకా రాసుకుంటున్నారు. అయితే లవ్ లెటర్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రియుడు లేదా ప్రేయసి మాట్లాడుకోవాలంటే తప్పనిసరిగా ప్రేమ లేఖలు రాసుకునే వాళ్ళు. అప్పట్లో వీటిని పంపించడానికి రకరకాల మార్గాలని అన్వేషించేవారు. ప్రేమని వ్యక్తపరిచేందుకు పదాలకి అక్షరాల రూపాన్ని కల్పించి లేఖలు రాసేవారు. తాజాగా ఒక ప్రేమ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పుడప్పుడు మనకి సోషల్ మీడియాలో పురాతన విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి ఇప్పుడు పాత ప్రేమ లేఖ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా షికార్లు కొడుతోంది. పాతది అంటే చాలా పాతది. సుమారు 250 ఏళ్ల నాటి ప్రేమలేఖ ఇది. అందులో ఏముందనేది తెలుసుకోవాలనుకుంటున్నారా..? సుమారు 250 ఏళ్ల క్రితం ప్రేమలేఖ ఇది. అయితే వాటిని ఇంతవరకు ఓపెన్ చేయకపోవడం ఇంకో విశేషం. ఫ్రాన్స్ నావికా దళంలో పనిచేసే సైనికులకి లెటర్స్ వచ్చాయని తెలుస్తోంది. బ్రిటన్ ఫ్రాన్స్ ఏడేళ్లు యుద్ధంలో పాల్గొన్న సైనికుల కోసం ఈ ప్రేమ లేఖలు రాయడం జరిగింది. ఈ ఉత్తరాలు ఏవి వాళ్ళకి చేరలేదు దీంతో బ్రిటిష్ నేవీ ఆ లేఖల్ని హస్తగతం చేసుకుంది. కేంద్ర యూనివర్సిటీ కి చెందిన ఒక ప్రొఫెసర్ ఈ లేఖల్ని కనుగొన్నారట.
Also read:
ఈ క్రమంలోనే వాటిని ఓపెన్ చేసిన ప్రొఫెసర్ ప్రేమలేఖలను చదవడానికి ప్రయత్నించారు. ఇందులో ఎస్ఎంఎస్ తరహాలో పదాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీ ప్రేమని పొందాలని ప్రయత్నిస్తున్నాను. నీకు లేఖ రాస్తూ రాత్రి సమయం అంతా గడపగలను. నువ్వంటే నాకు చనిపోయేంత ప్రేమ ఉందని లేఖలో ఉందిట. ఈ లేఖలు చదువుతే చాలా బాధగా ఉందని ప్రొఫెసర్ చెప్పారు. ఈ లేఖలో వారి ప్రేమను వ్యక్తపరచడం కాకుండా రోజువారి జీవితంలో జరిగే సంఘటనలు ఇంటి ఖర్చులు వంటి విషయాలని కూడా రాశారట. ఇవి కనుక సైనికులకు చేరి ఉంటే బాగుండేదని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.