Telugu News » అమ్మాయిలు ఎందుకు అమాయకులను దూరం పెట్టి.. చెడ్డవాళ్లకు దగ్గరవుతారు?

అమ్మాయిలు ఎందుకు అమాయకులను దూరం పెట్టి.. చెడ్డవాళ్లకు దగ్గరవుతారు?

అమ్మాయిలు ఎందుకు బాడ్ బాయ్స్ కు అట్ట్రాక్ట్ అవుతారు?

by Sri Lakshmi
tapsee

మీరెప్పుడైనా గమనించారా? ఓ క్లాస్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చునే అబ్బాయిల కంటే.. బ్యాక్ బెంచ్ లో కూర్చునే అబ్బాయిలకు అమ్మాయిలు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. బ్యాక్‌బెంచర్‌లు చేసే పనులకు అమ్మాయిలు ఎప్పుడూ ఆకర్షితులవుతారు. తరగతికి ఆలస్యంగా రావడం, దూకుడు ప్రదర్శించడం, నియమాలు పాటించకపోవడం, పొడవాటి జుట్టు, పచ్చబొట్లు, ధూమపానం లాంటి పనులు చేసేవారిని అమ్మాయిలు ఆశ్చర్యంగా అట్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. తల్లితండ్రులు ఎలాంటి వాడిని చూడొద్దు అంటూ వార్న్ చేస్తారో.. ఆశ్చర్యంగా అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకు పడిపోతూ ఉంటారు.

బాడ్ బాయ్స్ లో చాలా మందికి అధిక ఆత్మా విశ్వాసం ఉంటుంది. అదే అమ్మాయిలను వారి వైపుకి అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. వారి నేచర్ లో అది ప్రస్ఫూటంగా కనిపిస్తుంటుంది. ఓ సర్వే ప్రకారం అమ్మాయిల హార్మోన్స్ కూడా ఈ అట్రాక్షన్ లో కీలక రోల్ ప్లే చేస్తాయట. అమ్మాయిలు ఓవులేషన్ పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలకు త్వరగా ఆకర్షితులవుతారట. దానినే ప్రేమ అనుకుని భ్రమ పడుతుంటారట.

బాడ్ బాయ్స్ లో కనిపించే ధీమా, ఎవ్వరిని లెక్క చేయని తనం, దూకుడు, నాయకత్వ లక్షణాలు.. ఇవ్వన్నీ అమ్మాయిలకు ఆశ్చర్యంగా కనిపించి ఆకర్షణకు గురి అయ్యేలా చేస్తాయి. బాడ్ బాయ్స్ ఏ రూల్స్ ని ఫాలో అవ్వరు. వారికి నచ్చినట్లు స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడతారు. ఎవ్వరి ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా ఉంటారు. బాడ్ బాయ్స్ లో ఉండే మంచి విషయం ఏంటంటే.. వారు తమ పార్టనర్ విషయంలో మాత్రం కొంచం ప్రొటెక్టీవ్ గానే ఆలోచిస్తారు. వారిలో ఉండే ఈ ఆలోచన కూడా అమ్మాయిలకు బాగా నచ్చేస్తుంది. ఫన్ స్పిరిట్ గా ఉండి, అడ్వెంచరస్ గా లైఫ్ ని గడిపే వాళ్లంటే అమ్మాయిలకు ఆసక్తి కలుగుతుంది. జీవితం లో చాలా భాగం ఆంక్షలతో గడిపేసే అమ్మాయిలకు.. అబ్బాయిల్లో ఇలాంటి తత్త్వం కనిపిస్తే ఆకర్షణ సహజంగానే కలుగుతుంది. అందుకే ఎక్కువ మంది అమ్మాయిలు బాడ్ బాయ్స్ కె అట్ట్రాక్ట్ అవుతూ ఉంటారు.

You may also like

Leave a Comment