Telugu News » IAS TRansfers : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు….!

IAS TRansfers : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు….!

తాజాగా మరికొందరు ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా 26 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ కాంగ్రెస్ (Congress) సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

by Ramu
26 ias officers transfersin telangana smita sabharwal as member secretary of finance commission

రాష్ట్రంలో ఐఏఎస్ (IAS) అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం(Governament) కొలువు దీరాక ఇప్పటివరకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తాజాగా మరికొందరు ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా 26 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ కాంగ్రెస్ (Congress) సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

26 ias officers transfersin telangana smita sabharwal as member secretary of finance commission

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్ ల బదిలీ చేయడం ఇదే తొలిసారి. తాజాగా పురావస్తు శాఖ డైరెక్టర్‌గా భారతి హొళికేరిని ప్రభుత్వం నియమించింది. సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, ఫైనాన్స్‌ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్‌ ఎక్కాను బదిలీ చేసింది.

ఇక ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్‌ నజీద్, ఆయుష్‌ డైరెక్టర్‌‌గా ఎం.ప్రశాంతి , జీఏడీ కార్యదర్శిగా ఎం.రఘునందన్‌రావు, నల్గొండ కలెక్టర్‌‌గా హరిచందన,
రంగారెడ్డి కలెక్టర్‌ గా కే.శశాంక, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బీ.ఎం.సంతోష్‌, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌గా వల్లూరు క్రాంతి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా అద్వైత్‌ కుమార్ సింగ్‌, పంచాయతీ రాజ్‌, ఆర్‌డీ కార్యదర్శిగా సందీప్‌ సుల్తానియాను నియమించింది.

పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్‌‌గా చిట్టెం లక్ష్మి, ఫైనాన్స్‌, ఫ్లానింగ్‌ ప్రత్యేక కార్యదర్శి గా కృష్ణ భాస్కర్‌, పీసీబీ సభ్య కార్యదర్శిగా బుద్ధ ప్రకాశ్‌, మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం. ఖానమ్‌, కార్మిక శాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీగా ఆర్‌.వీ. కర్ణన్‌, సీఎంవో జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

You may also like

Leave a Comment