Telugu News » Sankranti Holidays : విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రకటించిన సంక్రాంతి సెలవులు..!!

Sankranti Holidays : విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రకటించిన సంక్రాంతి సెలవులు..!!

జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఇంటర్ కాలేజీల యాజమాన్యం ప్రకటించారు.. అయితే వీరికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పండగకు సెలవులు మంజూరు చేసింది.

by Venu

సంక్రాంతి (Sankranti) పండుగ సెలవుల (Holidays) కోసం ఎదురు చూస్తోన్న విద్యార్థులకు తెలంగాణ (Telangana) సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. పాఠశాలలకు అధికారికంగా సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని విద్యాశాఖ వెల్లడించింది.

ఇకపోతే జనవరి (January)12వ తేదీ నుంచి సంక్రాంతి సెలువులు ప్రారంభం కానున్నాయి.. మరుసటి రోజు రెండో శనివారం, తర్వాత 14 ఆదివారం భోగి పండుగ కాగా.. 15వ తేదీ సోమవారం సంక్రాంతి.. 16వ తేదీన కనుమ పండగ ఉంది.. కాగా, 17వ తేదీన ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ వస్తున్నాయి.

మరోవైపు సిలబస్ పేరిట, ప్రైవేటు విద్యాసంస్థలు పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. కాగా జనవరి 25న ఆదివారం, 26 రిపబ్లిక్ డే (Republic Day) ఉండటం వల్ల వరుసగా రెండు రోజులు సెలవులు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు సైతం సంక్రాంతి పండగకు సెలవులను ప్రకటించింది.

జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఇంటర్ కాలేజీల యాజమాన్యం ప్రకటించారు.. అయితే వీరికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పండగకు సెలవులు మంజూరు చేసింది. ఇందులో 13వ తేదీ రెండో శనివారం కాగా, 14న భోగి, 15న మకర సంక్రాంతి పండగా ఉండగా, 16వ తేదీన కనుమ పండగను జరుపుకోనున్నారు.. ఇక, 17వ తేదీ నుంచి విద్యార్థులు తిరిగి కాలేజీలకు రావాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

You may also like

Leave a Comment