Telugu News » బాలయ్య ని మ్యాచ్ చేయలేకపోతున్న మెగాస్టార్.. ఎక్కడ తేడా వస్తోందంటే..?

బాలయ్య ని మ్యాచ్ చేయలేకపోతున్న మెగాస్టార్.. ఎక్కడ తేడా వస్తోందంటే..?

by Sravya
chiru

నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు మంచి హిట్లవుతున్నాయి. పైగా నందమూరి బాలకృష్ణ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చిరంజీవికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఆయన ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలతో హిట్లు కొట్టారు. అయితే బాక్స్ ఆఫీస్ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి ఒకప్పుడు బాలయ్య దగ్గరగా కూడా ఉండలేకపోయారు. కేవలం సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు టైం లోనే అప్పట్లో బాలయ్య ఆధిపత్యం చూపించాడు.

bhagavanth kesari

కానీ నాలుగు దశాబ్దాలలో మెగాస్టార్ రేంజ్ ను మాత్రం బాలకృష్ణ ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయేవారు. బాక్స్ ఆఫీస్ సంగతి కాసేపు పక్కన పెడితే నటన విషయంలో కూడా చిరంజీవి పైనే ఉండేవారు. కళ్ళతోనే యాక్టింగ్ చేయగల అద్భుతమైన టాలెంట్ ఉంది చిరంజీవికి. పైగా కామెడీ టైమింగ్ తో ఓ రేంజ్ లో చిరు అందరినీ ఎంటర్టైన్ చేసేవారు. బాలయ్య మాత్రం అటువంటి విషయాల్లో చిరంజీవి కంటే తక్కువగానే ఉండేవారు. మెగాస్టార్ డామినేషన్ బాలయ్య మీద నడిచింది. రియంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ మాత్రం సినిమాలు విషయంలో కాస్త వెనకబడ్డారు.

Also read:

అఖండ వీర సింహారెడ్డి తో పాటుగా ఇప్పుడు రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమాల్లో నటించిన బాలకృష్ణ శభాష్ అని అనిపించుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ పరంగా బాలయ్య ఇప్పటికీ చిరంజీవికి దరిదాపుల్లో లేరు. చిరంజీవి కెరీర్ హైయెస్ట్ కలెక్షన్లు 140 కోట్ల రూపాయలు. బాలకృష్ణది మాత్రం అందులో సగం అంటే 70 కోట్లు. మెగాస్టార్ ని ఒక్కసారి తన యాంగిల్ లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి చిరంజీవి ఎందుకు ఇప్పుడు కథల విషయంలో బాలకృష్ణ ని దాటలేకపోతున్నారు మరి బాలయ్య కంటే అద్భుతమైన సినిమాలని మెగాస్టార్ చేస్తారో లేదో చూడాలి.

You may also like

Leave a Comment