Telugu News » Samantha: మనసుకు నచ్చిందే చేస్తా: సమంత

Samantha: మనసుకు నచ్చిందే చేస్తా: సమంత

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఖుషి(Khushi) సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఈ బ్యూటీ లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

by Mano
Samantha: Do whatever you want: Samantha

హీరోయిన్ సమంత(Heroin Samantha) సినిమాలకు సంబంధించి ఈ మధ్య ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నా సమంతా సినిమాలు చాలా వరకు తగ్గాయి. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఖుషి(Khushi) సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఈ బ్యూటీ లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘సిటడెల్’ (Citadel)లో నటిస్తోంది. ఈ వెబ్‌సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Samantha: Do whatever you want: Samantha

ఇదిలా ఉండగా సమంత సినిమా, వెబ్ సిరీస్‌లతో పాటు యూట్యూబ్ వేదికగా పాడ్ కాస్ట్ సిరీస్ కూడా చేస్తోంది. ఇందులో సమంత అప్పుడప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విడుదల చేసిన పాడ్ కాస్ట్‌లో సమంత తన అభిమానుల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. తన మాటను గౌరవించే అభిమానులు ఉండడం తన అదృష్టమని తెలిపింది.

ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదని చెప్పింది. తన అభిమానుల్లో చాలా మందికి వినోదం, ఫ్యాషన్, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ అని, వారిని చూసి ఎన్నో విషయాల్లో తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. అదేవిధంగా కొత్త అంశాలపై అవగాహన వచ్చిందని చెప్పుకొచ్చింది. తన మాట కొద్ది మందిపై ప్రభావం చూపించడం సంతోషమని, వారిలో మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి తానేం కోరుకోనని తెలిపింది సామ్.

నా మనసుకు నచ్చిందే చేస్తాను. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట తన మాటను గౌరవించే వాళ్లు ఉండటం అదృష్టం, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది సరైనదా.. కాదా అని ఆలోచిస్తాను. మానసికంగా  సరైనదా.. కాదా అని ఆలోచిస్తాను. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండలేరు. అందుకే నేనెప్పుడు మెంటల్ హెల్త్‌కు ప్రాముఖ్యతనిస్తాను. అని తెలిపింది. ఇదిలా ఉండగా ‘సిటడెల్: హనీ-బన్నీ’ పేరుతో త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో హీరోగా వరుణ్‌ధావన్, హీరోయిన్‌గా సమంత నటిస్తున్నారు.

You may also like

Leave a Comment