దర్శక ధీరుడు రాజమౌళి ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి ఓ రేంజ్ లో సినిమాలు తీసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తెచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు వండర్ ని క్రియేట్ చేశాయి. తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం కూడా ఆసక్తిగా ఈ సినిమాలని చూడాలని ఎదురు చూసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజమౌళి కీర్తి బాగా పెరిగింది. అయితే రాజమౌళి సినిమాలని రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజమౌళి సినిమాలని రిజెక్ట్ చేసిన నటుల గురించి చూద్దాం.
విక్రమార్కుడు సినిమాలో ప్రధాన పాత్ర పోషించే అవకాశాన్ని వదులుకున్నారు పవన్ కళ్యాణ్. బాహుబలి సినిమాలో రానా పాత్ర కోసం సూర్యని అడిగితే సూర్య దానికి ఒప్పుకోలేదు. ఫైనల్ గా రానాని పెట్టి తీశారు. మోహన్ లాల్ కట్టప్ప పాత్రను అంగీకరించలేదు. అలానే వివేక్ ఉబేరాయ్ బల్లాలదేవ పాత్రని పోషించడానికి ఒప్పుకోలేదు తర్వాత రానా ని అడిగారు. జాన్ అబ్రహం కూడా భల్లాలదేవ పాత్రని రిజెక్ట్ చేశారు. మగధీరలో ప్రధాన పాత్ర కోసం బాలకృష్ణ ని ముందు అడిగారట. కానీ బాలకృష్ణ ఒప్పుకోలేదు.
Also read:
బాహుబలిలో హీరో పాత్రని హృతిక్ రోషన్ ని అడిగారు కానీ ఒప్పుకోలేదు. అనివార్య కారణాల వలన కట్టప్ప పాత్రని అమితాబ్ బచ్చన్ కూడా రిజెక్ట్ చేశారు. అలానే సింహాద్రి మూవీ విషయానికి వస్తే.. ప్రభాస్ సింహాద్రి సినిమా చేయడానికి ఒప్పుకోకపోవడంతోనే, ఎన్టీఆర్ వద్దకి సినిమా వెళ్ళింది. బాహుబలిలో శివగమీ పాత్ర కోసం ముందు శ్రీదేవి ని అడిగారు కానీ ఆమె ఒప్పుకోలేదు. తర్వాత రమ్యకృష్ణ నటించారు. యమదొంగలో ప్రియమణి పాత్ర కోసం కాజల్ ని అడిగారు. కానీ కాజల్ రిజెక్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ లో జెన్నీ పాత్రని శ్రద్ధా కపూర్ రిజెక్ట్ చేశారు తర్వాత ఒలివియా మోరిస్ కి అవకాశం వచ్చింది.