పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు, రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయి అనేది, ముందుగా ఊహించి కాలజ్ఞానాన్ని రాశారు. ఆయన చెప్పినట్లుగానే, మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా, పవన్ కళ్యాణ్ గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉందని, అయన ప్రస్తావించారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.
Also read:
”ధరణిలో సిద్ధార్థి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున పవనుడోచ్చేనయ! రాజ వారసత్వము నశించినయ! ప్రజారాజ్యము విలసిల్లునయ!తప్పదు నా మాట నమ్మండయ” ఇలా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. దీంతో, తెలుగు సంవత్సరాలు సిద్ధార్థ ఎప్పుడు వస్తుందోనని జనసైనికులు తెగ చూస్తున్నారు. 1919, 1979, 2029, 2029లో సిద్ధార్థ నామ సంవత్సరం వస్తుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఒకవేళ అలా కుదరకపోతే, 2029లో అధికారం కచ్చితంగా వాళ్ళదేనని జనసైనికులు బలంగా నమ్మడం జరుగుతుంది.
కాలజ్ఞానంలో 2039 అని ఉండడంతో కాస్త నిరాశ చెందుతున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రము, పవనుడు, ప్రజారాజ్యము అనేవి కల్పితంగానే కనిపిస్తున్నాయి. నిజంగా ఇదంతా కాలజ్ఞానం లో ఉందా లేదంటే ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రచారం చేస్తున్నారా అనే సందేహం చాలా మందిలో ఉంది. 2019 ఎన్నికలప్పుడు చంద్ర దోషము వీడేనయ్యా అని రాసి వుండడం తో కాలజ్ఞానం ని వైరల్ చేశారు. కరోనా గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
బ్రహ్మంగారి కాలజ్ఞానం
వచ్చేది పవనుడు@Bobbilijsp @satish664422 @UAJanasainyam @SardaarSankar @ pic.twitter.com/9259EdY3W9— Gangadhar sanchana (@gangadhar4466) June 20, 2022