మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. ఆయనని చూసే చాలా మంది సినిమాల్లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఇద్దరు శతాధిక చిత్రాల దర్శకులు ని అందించిన ఘనత ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత కే రాఘవ గారికి దక్కుతుంది. రాఘవ నిర్మించిన తాత మనవడితో దాసరి నారాయణరావు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో కోడి రామకృష్ణ దర్శకుడుగా మారారు.
దాసరి నారాయణరావు శిష్యుడు రామ కృష్ణ గురు శిష్యుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి దర్శకులుగా చేసి తెలుగు సినిమాల్లోకి తీసుకువచ్చారు. కోడి రామకృష్ణ తీసుకొచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది 1982లో ఈ సినిమా వచ్చింది యావరేజ్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 512 వ రోజు సినిమాగా నిలిచింది.
Also read:
చిరంజీవి సరసన నాయకగా జయ పాత్రలో మాధవి నటించారు. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ అంటే 100 రోజులు సరి పోవట్లేదు. ప్రస్తుతం 150 నుండి 200 రోజులు తీసుకుంటున్నారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాని 29 రోజులలోనే పూర్తి చేశారట మూడు లక్షల 20వేల వ్యయమైన ఈ సినిమా కి పాలకొల్లు, నరసాపురం, పోడూరు, సఖినేటిపల్లి, భీమవరం మద్రాసులో షూటింగ్ జరిపారు.