Telugu News » Ranjana Naachiyaar: విద్యార్థులపై చేయిచేసుకున్న నటి అరెస్టు.. అసలు ఏమైందంటే..!!

Ranjana Naachiyaar: విద్యార్థులపై చేయిచేసుకున్న నటి అరెస్టు.. అసలు ఏమైందంటే..!!

ఈ ఘటన తమిళనాడులోని అడయార్‌, గెరుగంబాక్కంలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ నటి ఎవరంటే.. బుల్లి తెర నటి రంజనా నాచ్చియార్(Actress Rajana Naachiyar). ఈమె బీజేపీ కళలు, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కార్యదర్శి కూడా.

by Mano
Ranjana Naachiyaar: Actress arrested for touching students.. What really happened..!!

బస్సులో ఫుట్‌ బోర్డ్‌ ప్రయాణం చేసిన విద్యార్థులపై చేయి చేసుకోవడంతో పాటు.. ఆ బస్సు డ్రైవర్‌, కండక్టర్లను దూషించినందుకు ఓ సినీ నటిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని అడయార్‌, గెరుగంబాక్కంలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ నటి ఎవరంటే.. బుల్లి తెర నటి రంజనా నాచ్చియార్(Actress Rajana Naachiyar). ఈమె బీజేపీ కళలు, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కార్యదర్శి కూడా.

Ranjana Naachiyaar: Actress arrested for touching students.. What really happened..!!

శుక్రవారం గెరుగంబాక్కంలో ఎంటీసీ బస్సులో కొందరు పాఠశాల విద్యార్థులు ఫుట్‌బోర్డుపై నిలిచి ప్రమాదకర రీతిలో ప్రయాణించడా రంజనా చూశారు. బస్సును ఆపి డ్రైవర్‌పై మండిపడ్డారు. ఆ తర్వాత ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తున్న విద్యార్థులందరినీ దిగమని కోరగా వారు నిరాకరించారు. దీంతో కొందరు విద్యార్థులపై ఆమె చేయి చేసుకున్నారు. అదే సమయంలో కండక్టరును దుర్భాషలాడారు. ఈ సంఘటనకు సంబంధించి సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోలు ఒక సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి

ఆ తర్వాత బస్సు డ్రైవర్‌ శరవణన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, రంజనా నాచ్చియార్‌ను శనివారం ఉదయం అరెస్టు చేశారు. అయితే, రంజనాను అరెస్టు చేయడంపై పలువురు తప్పుబడుతున్నారు. సాధారణంగా ఫుట్‌బోర్డులో ప్రయాణించడం ప్రమాదకరం. అలాంటిది విద్యార్థులు బస్సు కిటికీల్లో నిలబడి, వేలాడుతూ అత్యంత ప్రమాదకరస్థాయిలో ప్రయాణం చేశారు. అలాంటి విద్యార్థులను ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన రంజనాను అరెస్టు చేయడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు, పోలీసులు అరెస్టు చేసిన రంజనా నాచ్చియార్‌కు శ్రీపెరంబుదూరు కోర్టు శనివారం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, 40 రోజుల పాటు మాంగాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలన్న నిబంధన విధించింది. రంజనాపై కేసు పెట్టొద్దని, విడుదల చేసేందుకు సీఎం జోక్యం చేసుకోవాలని బీజేపీ నేత సి.టి రవి డిమాండ్ చేశారు. ఈ నటి బిల్లా పండి, సుకుమారిన్ శబదం, మయం లాంటి తమిళ చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు.

You may also like

Leave a Comment