Telugu News » భారతీయుడు 2 సినిమాలో శంకర్… ఈ లాజిక్ ని మిస్ అయ్యారా..?

భారతీయుడు 2 సినిమాలో శంకర్… ఈ లాజిక్ ని మిస్ అయ్యారా..?

by Sravya

దర్శకుడు శంకర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలకి తెలుగునాట చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన డైరెక్షన్ లో ఎన్నో హిట్లు వచ్చాయి. ఎన్నోసార్లు తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు కూడా. శంకర్ కమల్ హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలుసు. అప్పట్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ ని సృష్టించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా రాబోతోంది. ఈ సినిమా గ్లిమ్ప్స్ ఇటీవలే రిలీజ్ అయింది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది ప్రేక్షకులు వాళ్లకి ఉన్న సందేహాలని బయటపెడుతున్నారు.

ఈ సినిమాలో సేనాపతి వయసులో వయసు పై ఉన్న సందేహాలని చెప్తున్నారు. భారతీయుడు సినిమాలో కమల్ పాత్ర 70 సంవత్సరాలు అన్నది మనకి తెలుసు. అయితే కౌంట్ చేసుకుంటే ఆయన వయసు ఇప్పుడు 97 ఉండాలి. సేనాపతి వయసు ఇంత ఉంటుందా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి.

Also read:

మరి శంకర్ ఎలా స్పందిస్తారో తెలియదు ఈ లాజిక్ ని పక్కన పెట్టేసి సినిమా చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు భారతీయుడు 2 కోసం కమల్ హాసన్ చాలా కష్టపడ్డారు అని తెలుస్తోంది. ఆయన వయసు ఇప్పుడు 69 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంత కష్టపడి సినిమా చేస్తుంటే కచ్చితంగా ప్రేక్షకులు చిన్న చిన్న లాజిక్ ని పక్కన పెట్టి సినిమాని ఎంజాయ్ చేస్తే మంచిది. ఇప్పటికే ఇండియన్ 2 సినిమాకి రికార్డు లెవెల్ లో బిజినెస్ జరుగుతోంది.

You may also like

Leave a Comment