Telugu News » కమల్ హాసన్ ఆస్తుల విలువ తెలిస్తే.. పక్కా ఆశ్చర్యపోతారు…!

కమల్ హాసన్ ఆస్తుల విలువ తెలిస్తే.. పక్కా ఆశ్చర్యపోతారు…!

by Sravya

నటుడు కమల్ హాసన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కమల్ హాసన్ అందరికీ సుపరిచితమే. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు ఒకపక్క సినిమాలతో ఇంకోపక్క రాజకీయాల్లో కూడా కొనసాగుతూ ఉంటారు ఈ ఏడాది విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాని సొంతం చేసుకున్నారు. తదుపరి సినిమాని కమల్హాసన్ మణిరత్నం దర్శకత్వంలో చేయబోతున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో కూడా కమల్ హాసన్ ఒక రోల్ చేయబోతున్నారు.

kamal-haasans-sensational-comments-saying-that-a-child-who-spoke-on-sanatana-dharma-is-being-targeted

కమల్ హాసన్ చాలా ఏళ్ల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే ఈయన ఎంత సంపాదించి ఉంటారో ఈయన ఆస్తులు విలువ ఎంత అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అవుతోంది. చాలానే ఆస్తులని కమల్ హాసన్ సంపాదించారట ఆస్తులతో పాటుగా ఖరీదైన విల్లాలు, కార్లు కూడా కమల్ హాసన్ కి ఉన్నాయి.

Also read:

ఇప్పటివరకు 177 కోట్ల రూపాయలని ఈయన సంపాదించినట్లు తెలుస్తోంది. లగ్జరీ ప్రాపర్టీలు కార్లు కూడా ఉన్నాయి చెన్నైలో కొన్ని కోట్ల విలువ చేసే ఖరీదైన ఇంట్లో కమల్ హాసన్ ఉంటున్నారు, మరొక పంతొమ్మిది కోట్ల విలువచేసే ఫ్లాట్ కూడా ఆయనకి ఉంది. చెన్నైలో సుమారు 92 కోట్లు విలువచేసే ఆస్తిపాస్తులు వ్యాపారాలు ఆయనకి ఉన్నాయి. లండన్ లో ఒక ఖరీదైన ఇల్లు కూడా ఉంది దాని విలువ 2.5 కోట్లు ఉంటుంది లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి ఇలా భారీ ఆస్తుల్ని కమల్ హాసన్ కూడబెట్టారు.

You may also like

Leave a Comment