Telugu News » టాయిలెట్ లోకి ఫోన్ తీసుకుని వెళ్తున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?

టాయిలెట్ లోకి ఫోన్ తీసుకుని వెళ్తున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?

by Sravya

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు స్మార్ట్ ఫోన్ లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అలా చాలామంది స్మార్ట్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారు. ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా కూడా స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ ని బాత్రూంలోకి తీసుకు వెళ్లే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు కూడా బాత్రూంలో కూర్చుని ఫోన్ చూస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ ఇబ్బందులు తప్పవని గుర్తు పెట్టుకోండి నిజానికి వైద్యులు టాయిలెట్ కి ఏ పని మీద వెళ్ళాము ఆ పని పూర్తి చేసుకొని త్వరగా బయటికి వచ్చేయాలి, ఫోన్ చూస్తూ కూర్చోవడం మంచిది కాదని చెప్తున్నారు.

పైల్స్ వచ్చే అవకాశం ఉందట. చాలామంది ఉదయాన్నే బాత్రూం కి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్తారు బాత్రూం లోపల చేసే పని ఐదు నిమిషాల్లో పూర్తయిపోవాలి కానీ ఫోన్ తీసుకుని వెళ్లడం వలన 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు బాత్రూంలోనే కూర్చొని ఉంటున్నారు. దీని వలన కూర్చుని ఉండడం వలన వెనుక భాగంపై ఒత్తిడి పడి పైల్స్ వచ్చేస్తోంది అని డాక్టర్లు చెప్తున్నారు. పైగా బాత్రూంలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఫోను పై కూడా చేరుతుంది.

Also read:

ఆ ఫోన్ మళ్ళీ తీసుకు రావడం వలన బ్యాక్టీరియా ఫోన్ నుండి మనకి వ్యాప్తి చెందుతుంది చేతులకి చేతుల ద్వారా నోటికి ముక్కుకి కూడా ఈ బ్యాక్టీరియా చేరుతుంది. ఇలా బ్యాక్టీరియా కారణంగా మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటే పాదాలు కాళ్లు మొద్దు మారిపోయినట్లు అయిపోతాయి కూడా. టాయిలెట్ సీట్ మీద ఉండే సూక్ష్మక్రిములు హాని కలిగిస్తాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వంటివి కలిగిస్తాయి. టాయిలెట్ సీట్ మీద ఉండే బ్యాక్టీరియా వలన డయేరియా వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. పొత్తికడుపునొప్పి, అతిసారం, ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజనింగ్ ఇలా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment