Telugu News » BRS : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న 17 నియోజకవర్గాలు.. ఇప్పటి వరకు పట్టుచిక్కలేదు..!!

BRS : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న 17 నియోజకవర్గాలు.. ఇప్పటి వరకు పట్టుచిక్కలేదు..!!

ఉమ్మడి ఖమ్మం (Khammam)జిల్లాతో పాటు, హైదరాబాద్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించ లేకపోయింది బీఆర్ఎస్. ఈ స్థానాలు కొరకరాని కొయ్యలా మారాయి అని భావిస్తున్న రాష్ట్ర అధిష్టానం.. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.

by Venu

రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చి తిరుగు లేకుండా దూసుకువెళ్తుంది. ప్రతిపక్షం అనేది లేకుండా ఏక పక్షంగా ఇన్నాళ్ళూ పదవిలో కొనసాగింది. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) గాలి మొదలైందని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజక వర్గాలలో దాదాపుగా తిరుగులేకుండా ఉన్న బీఆర్ఎస్ కు 17 నియోజకవర్గాల్లో విజయం అందని ద్రాక్షగానే మిగిలింది.

kcr

ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం (Khammam)జిల్లాతో పాటు, హైదరాబాద్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించ లేకపోయింది బీఆర్ఎస్. ఈ స్థానాలు కొరకరాని కొయ్యలా మారాయి అని భావిస్తున్న రాష్ట్ర అధిష్టానం.. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. రాజకీయ వ్యూహంలో భాగంగా పలునియోజక వర్గాలలో సభలు నిర్వహిస్తూ కేసీఆర్ (KCR) దూసుకెళ్తుండగా.. కేటీఆర్ (KTR) కూడా రోడ్డు షోలను ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా హామీలు, విపక్షాలపై విమర్శలతో ప్రచారం నిర్వహిస్తున్నారు..

మరోవైపు ప్రతిసారి బీఆర్ఎస్ గెలవకుండా ఊరిస్తున్న స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు, పినపాక, అశ్వరావుపేట, సత్తుపల్లి, వైరా, భద్రాచలం, మధిర నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో గోషామహల్, ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కార్వాన్, చార్మినార్, మలక్ పేట, చంద్రాయణగుట్ట, నాంపల్లి, యాకత్ పూర, బహదూర్ పుర స్థానాలు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు బీఆర్ఎస్ కు అందని ద్రాక్షలా మారాయని అనుకుంటున్నారు.

ఎంఐఎం పోటీ చేస్తున్న చోట్ల పెద్దగా టెన్షన్ లేకున్నా.. మిగిలిన 10 నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోందని విశ్వనీయ సమాచారం. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారైనా విజయం అందుకుంటుందా? అన్నది రాజకీయ వర్గాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..

You may also like

Leave a Comment