117
అహ్మదాబాద్(Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi stadium) వేదికగా జరిగిన ఫైనల్ సమరంలో భారత్(IND)పై ఆస్ట్రేలియా(AUS) ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన టీమిండియా(Team India)కు తుదిపోరులో నిరాశ ఎదురైంది.
ఆసీస్ టీమ్ ట్రావిస్ హెడ్ శతకంతో విజృంభించిన వేళ 43 ఓవర్లలోనే 241 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. లబుషేన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వరల్డ్ కప్‌లో నమోదైన రికార్డుల గురించి తెలుసుకుందాం.
ప్రపంచ కప్-2023లో నమోదైన రికార్డులివే..
- ఆసీస్ జట్టు 1987, 1999, 2003, 2007, 2015లో వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2023 ఎడిషన్ వరల్డ్ కప్ టైటిల్‌నూ కైవసం చేసుకుంది.
- క్రికెట్ చరిత్రలో ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ ఎడిషన్ కోహ్లీ మొత్తం 765 పరుగులు చేశాడు.
- 2003 ఎడిషన్‌లో సచిన్ తెందూల్కర్ నమోదు చేసిన 673 పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు.
- 2023 ప్రపంచ కప్ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోరు 428/5. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్కోర్ చేసింది.
- టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ ఆడిన 7 మ్యాచుల్లో 24 వికెట్లు తీశాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
- ప్రపంచకప్ కప్‌లో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్(49)ను రోహిత్ శర్మ అధిగమించాడు. రోహిత్ మొత్తం 54 సిక్సర్లు బాదాడు. అందులో 31 ఈ ఎడిషన్‌లోనే సాధించాడు.
- 2023 ప్రపంచకప్‌లో 400కు పైగా స్కోరు మూడు సార్లు నమోదయ్యింది.
- అత్యల్ప స్కోరు భారత్- శ్రీలంక మ్యాచ్‌లో నమోదైంది. భారత్ 357/8 టార్గెట్ ఇవ్వగా శ్రీలంక 55 పరుగులకే ఆలౌట్ అయింది. అదేవిధంగా దక్షిణాఫ్రికాను 83 పరుగులకే ఆలౌట్ చేసింది భారత్.
- అత్యధిక స్కోరును ఛేదించిన టీంగా పాకిస్థాన్ నిలిచింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగులను అధిగమించింది.
- ఆఫ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ 128 బంతుల్లో 201 (21×4, 10×6) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ప్రపంచకప్ ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
- ఒక ఇన్నింగ్స్ అత్యధిక సిక్స్ బాదిన ప్లేయర్‌గా పాకిస్థాన్ బౌలర్ ఫకర్ జమాన్ నిలిచాడు. ఓ మ్యాచ్‌లో 81 బంతుల్లో 11 సిక్సులు బాది 126* పరుగులు చేశాడు.
- దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ నాలుగు సెంచరీలు చేసి అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు.
- నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో విజయం సాధించి.. అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.