టాలీవుడ్ లో చాలామంది దర్శకులు ఉన్నారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్లు కొంతమంది ఒకప్పుడు తెలుగు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కనపడ్డారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అలా జూనియర్ ఆర్టిస్టుగా కనపడ్డ దర్శకులు వివరాలను ఇప్పుడు చూద్దాం. దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలతో హిట్లు కొట్టేశారు. ఈయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనబడ్డారు.
మహర్షి, ఊపిరి, మున్నా వంటి సినిమాలు తీసిన వంశీ పైడిపల్లి కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా కనపడ్డారు వర్షం సినిమాలో ప్రభాస్ త్రిష బస్సులో ప్రయాణిస్తూ ఉంటే వారికి తోటి ప్యాసింజర్ లా కనపడ్డారు. భగవంత్ కేసరి, సరిలేరు నీకెవరు వంటి సినిమాలతో హిట్లు కొట్టేసిన అనిల్ రావిపూడి శౌర్యం సినిమాలో చిన్న వేషం వేశారు. కాలేజీ సెట్టింగ్స్ లో అతను కనబడతారు. స్టాలిన్ సినిమాలో గోపీచంద్ మలినేని ఒక యాచకురాలతో మాట్లాడుతున్న సన్నివేశంలో కనపడతారు.
Also read:
సందీప్ రెడ్డి వంగ కేడి మూవీ లో కనపడ్డారు. శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక సినిమాలో చిన్న రోల్ చేశారు. బన్నీ నటించిన ఆర్య సినిమాలో ఓ చిన్న రోల్ చేశారు. అలానే శ్రీకాంత్ అడ్డాల అప్పట్లో గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. అందరివాడు సినిమాలో హరీష్ శంకర్ బ్రహ్మానందంతో కలిసి ఒక సీన్ చేశారు. ఇలా ఈ దర్శకులు జూనియర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కూడా కనిపించారు కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు.