Telugu News » Bhatti-Vikramarka : బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల విద్యుత్ కష్టాలు తీరలేదు..!!

Bhatti-Vikramarka : బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల విద్యుత్ కష్టాలు తీరలేదు..!!

ఇందిరమ్మ రాజ్యంలో అరాచకం కాదు ఆత్మగౌరవం ఉంటుందన్న భట్టి విక్రమార్క.. అందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఉద్యోగావకాశాలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్, పనికి ఆహార పథకాన్ని తీసుకువచ్చిందే ఇందిరమ్మ రాజ్యం అని తెలిపారు..

by Venu
Congress MLA Bhatti Vikramarka Press Meet

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. రాష్ట్రానికి మేలు చేస్తే కదా ప్రజలకు చెప్పడానికి విషయం ఉండేదని అంటున్నారు.. ఏంచేశారో చెప్పడం చేతగాక కాంగ్రెస్ (Congress)పై బురదజల్లుతున్నారని మండిపడుతున్నారు.. మరోవైపు బీఆర్ఎస్ తీరు పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీరు చేసిన అభివృద్ది చెప్పి ఓట్లు అడగటం మానేసి.. కాంగ్రెస్ పై విమర్శలు చేయడం చూస్తుంటే మీరు చేసిన డెవలప్ మెంట్ శూన్యం అని తెలుస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే నిర్బంధం తప్ప మీకు తెలిసింది ఏంటని భట్టి విక్రమార్క (Bhatti-Vikramarka) ప్రశ్నించారు. ఓ టీవీ చానెల్ నిర్వహించిన కాన్ క్లెవ్‌లో మాట్లాడిన భట్టి.. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నా సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో వర్గాలను కలిశాను. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో న్యాయం జరగలేదని అందరు బాధపడుతున్నట్టు భట్టి వెల్లడించారు..

ఇందిరమ్మ రాజ్యంలో అరాచకం కాదు ఆత్మగౌరవం ఉంటుందన్న భట్టి విక్రమార్క.. అందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఉద్యోగావకాశాలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్, పనికి ఆహార పథకాన్ని తీసుకువచ్చిందే ఇందిరమ్మ రాజ్యం అని తెలిపారు.. కాంగ్రెస్ పై పిట్టకూతలు కూస్తున్న బీఆర్ఎస్ నేతలు నిజాన్ని మరచి మాయ ఫకీర్ లా ప్రవర్తిస్తున్నారని భట్టి ఎద్దేవా చేశారు.. తెలంగాణకు కరెంట్ ఇబ్బందులు ఉంటాయని భావించిన సోనియా గాంధీ.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ (Telangana)కు అదనంగా 4 శాతం విద్యుత్ ఇచ్చిన విషయం మరచిపోవద్దని భట్టి అన్నారు..

అప్పుడు కాంగ్రెస్ ముందు చూపు, ఇప్పటి విద్యుత్ కష్టాలు తీరుస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ఒక్కరోజులో జరిగేది కాదని గతంలో కాంగ్రెస్ పాలకులు కొత్త పవర్ ప్లాంట్‌లు నిర్మిస్తే అవి వినియోగంలోకి వచ్చే సమయానికి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల విద్యుత్ కష్టాలు తీరాయనడంలో వాస్తవం లేదని భట్టి విక్రమార్క వివరించారు..

You may also like

Leave a Comment