Telugu News » స్టార్ హీరో ఇంటికి కోడలుగా.. కమెడియన్ పృథ్విరాజ్ కూతురు..!

స్టార్ హీరో ఇంటికి కోడలుగా.. కమెడియన్ పృథ్విరాజ్ కూతురు..!

by Sravya
comedian-Prudhvi-raj-Daughter

కమెడియన్ పృథ్వీరాజ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పాపులర్ అయిపోయారు. పృథ్వీరాజ్ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన పృథ్వీరాజ్ ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దానితో నెమ్మదిగా రాజకీయాల నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు పృథ్విరాజ్. పృథ్విరాజ్ కూతురు పేరు శ్రీలు. ఈమె హీరోయిన్ గా తెరకెక్కనున్న కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాకి పృధ్వీరాజ్ దర్శకత్వం వహించారు.

తన కూతురుతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రస్తుతం ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. పృధ్విరాజ్ కూతురు పెళ్లి ప్రస్తావన వచ్చింది. గత కొంతకాలం నుండి ఈమె ప్రేమలో ఉందని వార్తలు అయితే వచ్చాయి. కొద్దిరోజుల్లో స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నారా అని యాంకర్ ప్రశ్నించగా ఈ ప్రశ్నకి ఆమె బాగా సిగ్గుపడ్డారు. పృథ్వీరాజ్ సైతం ప్రేమ వ్యవహారాల గురించి పలు విషయాలని చెప్పారు. ఎవరి ఇంటికి కోడలుగా వెళ్లబోతోంది అనేది మాత్రం తెలియదు.

Also read:

పూర్తి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రోమను చూసి నెటిజెన్స్ ఎవరు అబ్బాయి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా నాన్న ఇండస్ట్రీలో ఉండి ఎన్ని వేల కోట్ల సంపాదించారు అని కూడా ఆమెని అడిగారు. 1000 కోట్ల 2000 కోట్ల అని కూడా అడిగారు. ఇక పృద్విని ప్రశ్నిస్తూ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లో ఎవరు ఇష్టమని కూడా అడిగారు ఇలా ఆసక్తికరమైన ప్రశ్నల్ని పృధ్విరాజ్ యాంకర్ అడిగారు.

You may also like

Leave a Comment