Telugu News » మెగాస్టార్ తన ఫోన్ లో సురేఖ, పవన్, చరణ్ పేర్లను… ఏ పేర్లతో సేవ్ చేసుకున్నారో తెలుసా..?

మెగాస్టార్ తన ఫోన్ లో సురేఖ, పవన్, చరణ్ పేర్లను… ఏ పేర్లతో సేవ్ చేసుకున్నారో తెలుసా..?

by Sravya
chiranjeevi-family

మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి స్వయంకృషితో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. పైగా మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలని పరిచయం చేశారు కూడా. మెగాస్టార్ చిరు సిల్వర్ స్క్రీన్ పై తనదైన స్టైల్ తో దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఉంటారు. యాంకర్ సుమ సుమ అడ్డా షో కి అతిథిగా కూడా వచ్చారు. ఇలా మెగాస్టార్ అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఉంటారు.

అయితే సుమ అడ్డా కి వచ్చినప్పుడు చిరంజీవి కొన్ని విషయాలని వెల్లడించారు అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది ఆయన పంచులతో బాగా నవ్విస్తూ ఉంటారు. సరదాగా సమాధానాలు చెప్తూ ఉంటారు. సుమ చిరంజీవిని, సురేఖ, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పేర్లను ఎలా ఫోన్ లో సేవ్ చేసుకున్నారు అన్న ప్రశ్న అడిగారు దీంతో చిరంజీవి ఈ విధంగా చెప్పారు. సురేఖ పేరుని రే అని సేవ్ చేసుకున్నాను.

Also read:

ఇలా చెప్పగానే అందరూ నవ్వారు. రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ పేర్లను ఎలా సేవ్ చేసుకున్నారనేది చూస్తే రామ్ చరణ్ పేరుని చెర్రీ అని, పవన్ కళ్యాణ్ పేరుని కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకున్నారు. తన తండ్రిని తలుచుకుని కూడా ఎమోషనల్ అయ్యారు చిరంజీవి. రీయంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన కొన్ని సినిమాలు బాగుంటే కొన్ని మాత్రం డిజాస్టర్లుగానే ఉండిపోయాయి. చరణ్ సరైన హిట్ కొట్టాలని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

You may also like

Leave a Comment