ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి చాలా సినిమాలు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ని తెచ్చుకుంటున్నాయి బాక్స్ ఆఫీస్ ని దున్నేసిన సినిమాలలో కేజీఎఫ్ కూడా ఒకటి. కేజీఎఫ్ గురించి ప్రతికించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు కన్నడ సినిమాలకి పెద్ద మార్కెట్ లేదు కన్నడలో స్టార్ హీరోలుగా చెప్పుకునే హీరోలు ఇతర భాషల్లో విలన్లుగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కన్నడ ఇండస్ట్రీ అంటే అందరికీ చిన్న చూపే కేజీఎఫ్ సినిమా దెబ్బతో అంతా మారిపోయింది. కన్నడ సినిమాలకి ఏకంగా ప్యాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ ఏర్పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ రికార్డులను క్రియేట్ చేసింది భారీగా వసూళ్లను రాబట్టింది.
అయితే ఇప్పుడు కేజిఎఫ్ వచ్చింది కానీ అచ్చం ఇలాంటి సినిమాలోనే మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 36 ఏళ్ల క్రితమే నటించారు. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. రాక్షసుడు సినిమా అది. కేజిఎఫ్ సినిమాలో యష్ కి తల్లి మాత్రమే ఉంటుంది అదేవిధంగా రాక్షసుడు సినిమాలో కూడా వితంతు మహిళ బిడ్డకి జన్మనిస్తుంది. ఊరి పెద్ద దానిని ఆమోదించక బిడ్డని పారేయగా ఒక తాగుబోతు చేతికి దొరుకుతాడు.
Also read:
ఆ తాగుబోతు అబ్బాయిని పెంచి లేబర్ క్యాంప్ కి విక్రయించాలని చూస్తాడు కానీ అతను తన తల్లిని వెతుకుకునేందుకు వెళ్తాడు. అక్కడ యజమాని మీ తల్లి పారిపోయింది దానికి తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు హీరో ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు..? తన తల్లిని ఎలా చేరుతాడు అన్నది కథ. సినిమా కథ అటు ఇటుగా ఉన్న టేకింగ్ మాత్రం కేజీఎఫ్ లానే ఉంటుంది ఈ సినిమా కూడా అప్పట్లో విజయాన్ని అందుకుంది.