Telugu News » BJP MP Laxman: ప్రజలు బీజేపీ మేనిఫెస్టో పవిత్రగ్రంథంలా భావిస్తున్నారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman: ప్రజలు బీజేపీ మేనిఫెస్టో పవిత్రగ్రంథంలా భావిస్తున్నారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని రోడ్ షోకు, సభలకు విశేష ఆదరణ లభించింది.. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు.

by Mano
BJP MP Laxman: People consider BJP manifesto as holy book: BJP MP Laxman

తెలంగాణ ప్రజలు బీజేపీ మేనిఫెస్టోను ఒక పవిత్రగ్రంథంలా భావిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌(HYD)లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని రోడ్ షోకు, సభలకు విశేష ఆదరణ లభించింది.. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు.

BJP MP Laxman: People consider BJP manifesto as holy book: BJP MP Laxman

బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అయితే, ముస్లిం పార్క్ ఏర్పాటు చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. బాధ్యతయుతమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి హామీలు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పార్టీల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించిన ఆమోదయోగ్యమైన హామీలనే బీజేపీ ఇచ్చిందని తెలిపారు.

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. కర్ణాటక ప్రజల సొమ్ముతో తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు ఇస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. కర్ణాటక ఇవాళ కాంగ్రెస్‌కు ఏటీఏంగా మారిందని విమర్శించారు. బీజేపీకు ఓటు వేయాలని బీసీలు, ఎస్సీలు, మహిళలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రలోభాల మీదనే ఆధారపడ్డాయి తప్పితే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని లక్ష్మణ్ అన్నారు.

ప్రజలు ‘టాటా కాంగ్రెస్.. బై బై బీఆర్ఎస్.. వెల్ కమ్ బీజేపీ’ అంటూ నినాదాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ‘కారు షెడ్డుకు పోతుంది.. కమలం వికసిస్తుంది.’ అని అన్నారు. ఇక చరిత్రలో కాంగ్రెస్‌కు 60 సీట్లు దాటిన దాఖలాలు లేవని చెప్పారు. ఇప్పుడు అరువై సీట్లు వస్తాయని ఎట్లా ఊహించుకుంటున్నారని ప్రశ్నించారు. మోడీ మూడు రోజుల పర్యటన పార్టీ విజయానికి ఎంతో దోహదం చేస్తుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.

మోడీపై ప్రజలు అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఇటు కేసీఆర్ అబద్ధపు మాటలు, వాగ్దానాలు విని విని ప్రజలు విసుగుచెందారని ఎద్దేవా చేశారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల మనోగతాన్ని ప్రభావితం చేసే సంకల్ప పత్రమని వ్యాఖ్యానించారు.

You may also like

Leave a Comment