Telugu News » CPI Narayana : కాళేశ్వరం ముంచిన కేసీఆర్.. కల్వకుంట్ల ఖజానా నింపిండు..!!

CPI Narayana : కాళేశ్వరం ముంచిన కేసీఆర్.. కల్వకుంట్ల ఖజానా నింపిండు..!!

గులాభి చూపుకు అందంగా కనిపిస్తుంది. కానీ దాని ముళ్ళు గుచ్చుకుంటే చాలా నొప్పిగా ఉంటుంది అని వివరించిన నారాయణ.. కేసీఆర్ కూడా గులాబీ కింద ఉన్న ముళ్ళు లాంటి వ్యక్తి అని విమర్శించారు..

by Venu

తెలంగాణలో రాజకీయ చదరంగం చివరి దశకు చేరుకుంది. విజేత ఎవరో మరో ఐదు రోజుల్లో తెలనుంది. ఇప్పటికే నేతల గుండెలు లబ్ డబ్ అనే శబ్ధం కు బదులుగా గెలుపా? ఓటమా? అని కొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక బీపీ అయితే విజయం కోసం హై రేంజుకు చేరిందని అనుకుంటున్నారు ప్రచారాలు నిర్వహిస్తున్నవారు.. మొత్తానికి ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయనడంలో సందేహం లేదు..

మరోవైపు అందరికీ సన్‌ స్ట్రోక్ ఉంటే.. కేసీఆర్‌కు మాత్రం డాటర్ స్ట్రోక్ తగిలిందని కామెంట్స్ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana).. రఘునాథపాలెం మండలం బాలపేటలో, కాంగ్రెస్‌ అభ్యర్థి (Congress Candidate) తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwar Rao) తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారాయణ లిక్కర్ స్కాం వల్ల బీజేపీకి (BJP) కేసీఆర్ తలొగ్గారని ఆరోపించారు.

గులాభి చూపుకు అందంగా కనిపిస్తుంది. కానీ దాని ముళ్ళు గుచ్చుకుంటే చాలా నొప్పిగా ఉంటుంది అని వివరించిన నారాయణ.. కేసీఆర్ కూడా గులాబీ కింద ఉన్న ముళ్ళు లాంటి వ్యక్తి అని విమర్శించారు.. తులసి మొక్క లాంటి తుమ్మలపై.. గంజాయి మొక్కలాంటి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) పోటీకి నిలబడటం హాస్యాస్పదమని వెటకారం చేశారు నారాయణ..

ఖమ్మంలో పోటీ తులసి మొక్కకు గంజాయి మొక్క మధ్య అంటూ వ్యాఖ్యలు చేసిన నారాయణ.. పువ్వాడకు సీపీఐ పార్టీ ఓట్లు వేయదని అందుకు తనది గ్యారంటీ అని స్పష్టం చేశారు. తనతో తుమ్మలకు నలభై ఏళ్లుగా పరిచయముందని తెలిపారు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంకు చెంపపెట్టు అని తెలిపిన సీపీఐ నేత నారాయణ.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు నెల రాలడం ఖాయమని విమర్శించారు..

కేసీఆర్, కాళేశ్వరం (Kaleshwaram) ముంచిండు.. కల్వకుంట్ల కుటుంబ ఖజానా నింపిండని విమర్శించిన నారాయణ.. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినట్లే కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) కూలిపోతుందని జోస్యం చెప్పారు.. కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు..

You may also like

Leave a Comment