హీరో వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. భారత చలన చిత్ర చరిత్రలో నిర్మాత దగ్గుబాటి రామానాయుడుది నిజానికి ఒక అరుదైన అధ్యయనం అని చెప్పుకోవాలి. సినీ పరిశ్రమకి ఆయన చేసిన సేవలు ఎన్నో. మూవీ మొగల్ అనే బిరుదుని 100% అయిన పరిపూర్ణం చేసుకున్నారని కూడా మనం డౌట్ లేకుండా చెప్పొచ్చు. రామనాయుడు చివరి శ్వాస దాకా సినిమానే ఊపిరిగా చేసుకుని జీవించారు చరిత్రలో తన పేరు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. తెలుగులోనే కాకుండా అన్ని భారతీయ భాషల్లో కూడా సినిమాలు తీశారు.
150 కంటే అత్యధిక చిత్రాలని నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కారు అయితే ప్రతి పురుషుని విజయ వెనక ఒక స్త్రీ ఉంటుంది. రామానాయుడు విజయం వెనకాల సతీమణి రాజేశ్వరి ఉన్నారు. సురేష్ వెంకటేష్ ఇద్దరు కొడుకులు వీళ్ళకి. అలానే లక్ష్మి అనే కూతురు కూడా ఉంది. గ్రామంలో వ్యవసాయాన్ని వదిలేసి సినీ రంగానికి వెళ్లాలని రామానాయుడు అనుకున్నారు. అప్పుడు ఆయన భార్య రాజేశ్వరి వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించారు. రామానాయుడు ఒంగోలులో బంధువుల ఇంట్లో ఉంటూ ఎస్ఎల్సి చదివేవారిట ఆ టైంలో మేనమామ ఇంటికి తరచూ వెళ్లేవారు.
Also read:
రాజేశ్వరిని చూసి ఆయన మనసు పారేసుకున్నారు ఆమెను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను అని చెప్పారు ఇక తల్లిదండ్రులు ఒప్పుకొని పెళ్లి చేశారు రూపాయి విలువ తెలుసు కాబట్టి రాజేశ్వరి వచ్చిన ఆదాయంలో చాలా మట్టుకు పొదుపు చేసేవారు. రామానాయుడు చిత్ర రంగానికి వెళ్లడానికి వీలుగా ఒకసారి లక్ష రూపాయిలు ఇచ్చేసరికి ఆయన షాక్ అయిపోయారు ఇదంతా చిన్నప్పటి నుంచి దాచిన డబ్బులు అని ఆయనకి చెప్పారట. రామానాయుడు కళ్ళనుండి నీళ్లు వచ్చేసాయట ఆమె దగ్గర నుండి డబ్బులు తీసుకుని ఇండస్ట్రీకి వెళ్ళాక ఇక ఆయన పట్టిందల్లా బంగారమే.