చిరంజీవి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు మంచి హీరోగా పేరు పొందారు. విపరీతమైన క్రేజ్ ని కూడా చిరంజీవి సంపాదించుకున్నారు ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీ నుండి చాలా మందిని హీరోలుగా మార్చేశారు. సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయాల్లో కూడా చిరంజీవి సాధించిన రికార్డులు అవార్డులు ఎవరు కూడా సాధించలేరు. చిరంజీవి తన కుటుంబ సభ్యుల్ని కాకుండా బయట వాళ్లని కూడా ఎంతగానో ప్రోత్సహించారు. చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఈ విషయం గురించి మనకి తెలుసు తన అల్లుడిలో ఉన్న టాలెంట్ ని గుర్తించి చిరంజీవి అతను సినిమాల్లో నటిస్తే బాగుంటుందని చెప్పారట అలా కళ్యాణ్ దేవ్ విజేత సినిమాలో నటించారు. అయితే నిజానికి కళ్యాణ్ దేవ్ ఎప్పుడు యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. శ్రీజను పెళ్లి చేసుకునే వరకు కూడా అతను ఎవరు అన్నది ఎవరికీ తెలియదు కూడా. శ్రీజని పెళ్లి చేసుకున్నాక చిరంజీవి ప్రోత్సాహంతో కళ్యాణ్ మీదకి వచ్చాడు.
Also read:
1990 ఫిబ్రవరి 11న కిషన్ దేవ్ కానుగంటి జ్యోతి దంపతులకు చిత్తూరులో కళ్యాణ్ దేవ్ పుట్టారు. కిషన్ దేవ్ దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయల టర్నోవర్ ని సాధించాడు తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్లు ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. చిత్తూరు జిల్లాలోని వారికి చాలా ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లలో మార్కెట్ మాస్టర్ డిగ్రీ చేశాడు కళ్యాణ్ దేవ్ అయితే ఇప్పుడు మాత్రం శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోయారు. కలిసి ఉండట్లేదు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్లు కూడా పెడుతూ ఉంటారు.