నందమూరి బాలకృష్ణ ఎప్పటినుండో సినిమాల్లో రాణిస్తూ విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకున్నారు. ఆయనకి ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. సీనియర్ హీరోలలో బాలయ్యకి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ లు కొట్టేస్తున్నారు రాజకీయాల్లోకి కూడా బాలయ్య ఎంట్రీ ఇచ్చేసి తండ్రి స్థాపించిన పార్టీలో బాధ్యతలు చూసుకుంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో బాలయ్య నెగ్గారు.
ఆయన ఫ్యామిలీ పేరిట మొత్తం 365 కోట్లు ఉన్నట్లు ఆఫిడవిట్ లో పేర్కొన్నారు బాలయ్యకి 400 గ్రాములు బంగారం, ఐదు కిలోల వెండి ఉందట. ఆయన భార్య వసుందరికి 3487 గ్రాముల బంగారం, 300 క్యారెట్ల వజ్రాలు, 31 కిలోల వెండి ఉండగా, కొడుకు దగ్గర 250 గ్రాములు బంగారం, 17 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్తులు విలువ 325 కోట్ల వరకు ఉంటుంది. బాలయ్య కి 169 కోట్లు బాలయ్య భార్య వసుంధర పేరిట 125 కోట్లు ఉన్నట్లు అఫీడవిట్ లో చెప్పడం జరిగింది.
Also read:
లింగంపల్లిలో రెండు ఎకరాల భూమి అలానే సొంత ఊరు అయిన నిమ్మకూరులో ఏడెకరాల వ్యవసాయ భూమి ఉన్నాయట. రాయదుర్గం మండలం పవన్ ముక్తాలో వేయి చదరపు అడుగుల ఫ్లాట్ మాదాపూర్ లో ఫ్లాట్లు ఉన్నాయి. రామకృష్ణ స్టూడియోలో వాటా, హెరిటేజ్ ఫుడ్స్ లో షేర్లు, ఇన్నోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ లో 49% వాటా వుంది. రిలయన్స్ సంస్థలో కూడా షేర్లు ఉన్నాయి. కోటి విలువ చేసే బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది.