టాయిలెట్ కి వచ్చిందని నోటితో చెప్పడానికి బదులుగా చిటికెన వేలుని చూపిస్తూ ఉంటారు చిన్నప్పుడు స్కూల్లో కూడా టీచర్ కి టాయిలెట్ వస్తే పర్మిషన్ తీసుకోవడానికి చిటికెన వేలు చూపించే వాళ్ళం. అయితే అసలు ఎందుకు టాయిలెట్ కి వస్తే.. చిటికెన వేలు చూపించాలి దీని వెనక కారణం ఏంటి..? ఎప్పుడైనా మీకు ఈ సందేహం వచ్చిందా..? దీని వెనక కారణాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం. టాయిలెట్ కి సిగ్నల్ గా చిటికెను వేలుని ఎందుకు చూపిస్తాము..? మన పురాతన భారతీయ బోధనల ప్రకారం చేతి యొక్క 5 వేళ్ళు అనేది మానవ జీవితాన్ని రూపొందించిన ప్రకృతిలోని ఐదు ప్రాథమిక మూలకాలను సూచిస్తాయి.
Also read:
ఒకటి ఆకాశం, రెండు వాయువు, మూడు అగ్ని, నాలుగు భూమి, ఐదు నీరు. ఈ ఐదు మూలకాలు మన చేతిలో ఐదు వేళ్ళని సూచిస్తాయి. బొటనవేలు వచ్చేసి అగ్నిని, చూపుడు వేలు గాలి, మధ్య వేలు ఆకాశాన్ని, ఉంగరపు వేలు భూమిని, చిటికెన వేలు వచ్చేసి నీటిని సూచిస్తాయి. శరీరంలో ఉన్న నీరు పరిమితి దాటి అదనపు స్థాయికి చేరుకున్నప్పుడు నీటిని తొలగించడానికి నీటిని సూచించే విధంగా చిటికెన వేలిని చూపించి సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మలమూత్రాలకి వెళ్లాలని చిటికెన వేలు చూపిస్తారు.
ఇలా టాయిలెట్ వస్తే చిటికెన వేలును చూపించడం జరుగుతుంది. అదే అమెరికాలో చిటికెన వేలుని చూపిస్తే బీర్ ఇవ్వమని అడగడం. అలానే టాయిలెట్ ఒక నిమిషంలో అయిపోతుంది కాబట్టి చిటికెన వేలు చూపిస్తారని కూడా అంటూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు.