Telugu News » Dhootha web series review : దూత వెబ్ సిరీస్ ని ఎంచుకుని నాగ చైతన్య తప్పు చేశాడా..? సిరీస్ ఎలా ఉందంటే..?

Dhootha web series review : దూత వెబ్ సిరీస్ ని ఎంచుకుని నాగ చైతన్య తప్పు చేశాడా..? సిరీస్ ఎలా ఉందంటే..?

Dhootha web series review

by Sravya
Dhootha-review

మొదటిసారి నాగ చైతన్య ఓటిటిలోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు కేవలం సినిమాలే చేసిన చైతు ఇప్పుడు “దూత” వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చాడు. అమెజాన్ ప్రైమ్ ఓటిటిలోకి ఇది వచ్చింది.

నటీ నటులు: నాగ చైతన్య, పార్వతి తిరువోతు, సత్యప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తనికెళ్ల భరణి, తరుణ్ భాకర్, అనీష్ కురువెళ్ల, రోహిణి తదితరులు.
నిర్మాత: శరత్ మరార్
రచయిత – దర్శకత్వం: విక్రమ్ కె కుమార్

Dhootha web series review

Dhootha web series review

Also read:

Dhootha దూత కథ:

సాగర్ (నాగ చైతన్య) నైతికత కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్న జర్నలిస్ట్. తనకి దగ్గరగా వుండే వాళ్లంతా ఒక్కళ్ళ తరవాత ఇంకొకరి చనిపోవడం వలన ఊహించని సంఘటనలు అతని ప్రపంచాన్ని కదిలిస్తాయి. ప్రతి విషాదం ద్వారా అతను కొత్త విషయాలను తెలుసుకుంటాడు. ఆ టైం లో స్పెషల్ ఆఫీసర్ ఈ సంఘటనలను పరిశీలిస్తారు, ఇది చాలా సమస్యలకు దారి తీస్తుంది. ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి..? ఈ హత్యలన్నింటి వెనుక ఎవరున్నారు…?

సాగర్ మిస్టరీ ని ఛేదిస్తాడా..? ఈ సిరీస్ ను చూస్తే ఈ సమాధానాలన్నీ తెలుస్తాయి. ఈ సిరీస్ ని డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీశారు. జర్నలిస్ట్ గా పని చేసే హీరో సడెన్ గా ఓ పేపర్ క్లిప్ ని చూడడం, అదే జరగడం. అంతా కూడా బాగుంటుంది. ఐదారు ఎపిసోడ్లు చూసే దాకా స్టోరీ తెలీదు. సస్పెన్స్ తో ఇదంతా నడుస్తుంది. సాంకేతిక అంశాలు అద్భుతంగా ఉన్నాయి. మొదటి మూడు ఎపిసోడ్‌లు, చివరి రెండు ఎపిసోడ్‌లు బాగున్నాయి. చైతు గ్రే క్యారెక్టర్ బాగా చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా చేసాడు,

రేటింగ్: 3/5

 

You may also like

Leave a Comment