ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఒక్క క్షణం తీరిక లేకుండా ఆయన సమయాన్ని గడుపుతున్నారు. ఇది చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా హీరో ఇంతలా కష్టపడుతున్నారా అని సానుభూతిని కూడా చూపిస్తున్నాను. అక్టోబర్ నెల నుండి సినిమాలు షూటింగ్ కి విరామం ఇచ్చారు. పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు ఇలా అయినా నిర్ణయం తీసుకోవడంతో అప్పటిదాకా షూటింగ్ అయినా ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు ఆగిపోయాయి అయితే ఈయన ఎక్కువగా హరిహర వీరమల్లు సినిమాని పట్టించుకోలేదట.
డైరెక్టర్ క్రిష్ తో పాటు నిర్మాత ఏం రత్నం తీవ్ర నిరాశలో ఉన్నారు. నిర్మాత రత్నం, దర్శకుడు క్రిష్ కలిసి సినిమా షెడ్యూల్స్ పై పవన్ తో చర్చించడానికి చాలాసార్లు ట్రై చేసినా కూడా పవన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు దీనిపై రత్నం తీవ్ర అసహనంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫైనాన్షియర్ల నుండి 80 కోట్ల రూపాయలకి పైగా అప్పుచేసి ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి చేసామని ఇప్పుడు ఆయన రాజకీయాలు చూసుకుంటే పరిస్థితి ఏంటి అని రత్నం చెప్పినట్లు తెలుస్తోంది.
Also read:
ఈ సినిమా షెడ్యూల్స్ డేట్స్ కి సంబంధించి పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే సినిమాని పూర్తిస్థాయిలో ఆపేయాల్సి వస్తుందట. ఇదే జరిగితే ఖచ్చితంగా నిర్మాతకి ఎంతో నష్టం ఉంటుంది ఏప్రిల్ లో పోయి సినిమాకి సంబంధించి ఫైనల్ చేయకపోతే 80 కోట్లు పెట్టుబడిని వడ్డీతో సహా కట్టాలని పవన్ ని డిమాండ్ చేశారట.