పాటలు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. పాటలను రోజు వింటూ ఉంటారు పాటలు లేకపోతే అస్సలు ఏమీ తోచని వాళ్లు కూడా ఉంటారు. అయితే కొన్ని కొన్ని వీడియో సాంగ్స్ చూస్తే అబ్బా అనిపిస్తూ ఉంటుంది నిజానికి కొన్ని సినిమాల్లో పాటలని చిత్రీకరించడం కోసం కొన్ని కొన్ని సార్లు వేరే వేరే ప్లేస్ లకి వెళ్తారు అలానే చాలా డబ్బులు కూడా ఖర్చు చేస్తారు అయితే టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో చిత్రీకరించిన పాటలు వివరాలు చూద్దాం.
బన్నీ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాలోని రాములో రాముల పాట ని ఎక్కువ డబ్బులు పెట్టి కంపోజ్ చేసారు. ఈ పాట కోసం సెట్, విజువల్స్ కోసం ప్రొడ్యూసర్ లు ఏకంగా రూ.1.2 కోట్లు పెట్టారట. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఇరగ ఇరగ సాంగ్ కి అయితే రూ.1.5 కోట్లు ఖర్చు పెట్టారట.
అదే విధంగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటను చిత్రీకరించడానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. మహేష్ భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యో స్వామి పాట కోసం ఏకంగా 2.5 కోట్లు ఖర్చు చేసారు. బాహుబలి సినిమాలోని సాహోరే బాహుబలి పాట కోసం ఏకంగా ఐదు కోట్లు పెట్టారు.