నందమూరి తారకరామారావు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన పాలిటిక్స్ ద్వారా సినిమాల ద్వారా అందరికీ దగ్గరయ్యారు. చాలామందికి ఎన్టీఆర్ కుమారుల గురించి తెలుసు. కానీ వాళ్ళు ఎలా స్థిరపడ్డారు అనే విషయం తెలియదు. ఈరోజు మనం ఆ విషయాన్ని చూసేద్దాం. ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆయన వారసులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవ చేయాలని ఎన్టీఆర్ ఎప్పుడు అనుకునేవారు. వారి బిడ్డల ముగ్గురు తన భవిష్యత్తుని సినిమా పరిశ్రమకి అంకితం చేశారు.
నా బిడ్డలు నా ఆస్తికి మాత్రమే వారసులు కాకుండా నటన పరంగా కూడా వారసులుగా నిలవాలని ఎన్టీఆర్ కోరుకునే వారు. 50 ఏళ్ళ వయసులో కూడా రోజుకి 20 గంటలు పని చేసేవారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి ఏడుగురు కొడుకులు ఉన్నారు. వారి జీవితాలకి ఆయన జీవితం మార్గదర్శకంగా ఉండాలి. క్రమశిక్షణతో నా పిల్లలు కర్తవ్యాన్ని తెలుసుకునే జీవించడం కోసమే నేను ఇలా శ్రమిస్తున్నాను అని ఎన్టీఆర్ అనుకునేవారట.
Also read:
ఆయన ఆశించినట్లే బిడ్డలందరూ కూడా క్రమశిక్షణతో ఉంటూ తండ్రికి తగ్గ తనయలుగా పేరు తెచ్చుకోవడం జరిగింది. హరికృష్ణ బాలకృష్ణ ఆయన నట వారసులుగా చిత్రపరిశ్రమంలోకి అడుగుపెట్టారు. నందమూరి మోహన్ కృష్ణ సాంకేతిక రంగంలోకి అడుగుపెట్టి అద్భుతమైన ఛాయాగ్రాహికుడిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. నందమూరి రామకృష్ణ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి స్టూడియో నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు మిగిలిన తనయులు తండ్రి ఇచ్చిన ఆస్తితో వివిధ రంగాల్లో స్థిరపడ్డారు ఆయన మనవులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు.