రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం దూకుడు పెంచింది. కొత్తగా సీఎం(CM)గా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పీడ్ పెంచారు. రావడంతోనే ప్రగతి భవన్‌ను ప్రజా దర్బార్‌గా మారుస్తూ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పడంతో జనం సుదూరాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం మహ్మాతా జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్ద ఫిర్యాదులతో ప్రజలు బారులు తీరారు.
దీంతో బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజావాణికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజా భవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చిన వారిలో ఎక్కువగా భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారానికి రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తుండటంతో భారీగా జనం తరలివస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు మంత్రులు, అధికారులు రానున్నారు. ప్రజా దర్బార్‌ను ఈనెల 8వ తేదీన ప్రారంభించారు. ప్రతీఒక్కరి సమస్య, పూర్తి డేటాను సెల్ నెంబరుతో సహా డిజిటల్ ఎంట్రీ చేస్తున్నారు.