Telugu News » Raghuram Rajan: దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దు.. మాజీ ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక..!

Raghuram Rajan: దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దు.. మాజీ ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక..!

రఘురామ్ రాజన్(Raghuram Rajan) ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దని, అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరించారు.

by Mano
Raghuram Rajan: Do not give freebies to the extent of bankruptcy.. Ex-RBI governor warns..!

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మాజీ ఆర్బీఐ గవర్నర్(RBI Governor) రఘురామ్ రాజన్(Raghuram Rajan) స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దని, అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరించారు. పేదలకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీయమైనప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇవ్వరాదని రఘురామ్ రాజన్ సూచించారు.

Raghuram Rajan: Do not give freebies to the extent of bankruptcy.. Ex-RBI governor warns..!

రాబోయే కొన్నేళ్లలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్ దూసుకుపోతుందని రఘురామ్ రాజన్ తెలిపారు. ఇక, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానికలలు కన్నారు కానీ.. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వాల నిర్ణయాలు ఆయన కల నెరవేరే అవకాశం లేదని రఘురామ్ రాజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత వృద్ధి రేటుతో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడం కష్టమని తెలిపారు.

భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుతం 2500 డాలర్లుగా ఉన్నందున మనం ఇదే స్థాయిలో ముందుకు సాగితే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం చాలా కష్టమవుతుందని తెలిపారు. 2016 డీమోనిటైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నపై రఘురామ్ రాజన్ స్పందిస్తూ.. డీమోనిటైజేషన్ ప్లాన్ పని చేస్తుందా లేదా అని ప్రధాని కార్యాలయం తనను కోరగా మంచి చెడులను చెప్పానన్నారు.

మనకు స్వాతంత్ర్యం వచ్చిన 100వ సంవత్సరం నాటికి అంటే 2047 వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం చాలా కష్టమని రఘురామ్ రాజన్ తెలిపారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం, 3.7 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు. అదే టైంలో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎపీ భారతదేశ నామమాత్రపు జీడీపీ వచ్చే 7 సంవత్సరాల్లో 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రాజన్ అంచనా వేశారు.

You may also like

Leave a Comment