సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలతో సినిమాలతో కూడా అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్రీ నటుడుగా వెలుగు వెలిగారు ఎన్టీఆర్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఉంది అంటే అందుకు ప్రధాన కారకుడు ఆయన అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ తెలుగు సినిమా ఫీల్డ్ లో అన్ని రకాల పాత్రలు చేశారు. ఆయన చేయని పాత్ర లేదు. ఒక వైపు సినిమాలు అలానే ఇంకోపక్క రాజకీయాల్లో కూడా ఆయన ఎంత చేయగలిగితే అంత చేశారు.
తక్కువ కాలంలోనే సీఎం అయ్యారు కూడా. ఇప్పటివరకు అంత తక్కువ టైంలో పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు ఇప్పటివరకు ఎవరూ లేరని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అంటే అందరికీ ఎంతో అభిమానం కూడా. అయితే ఆయన ఎప్పుడు చూసినా కాషాయ దుస్తులు ధరించేవారు. దానికి కారణం ఏంటి..? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది మరి మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే ఇప్పుడే తెలుసుకోండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో జరిగిన ఒక సినిమా అవార్డు ఫంక్షన్లో కాషాయ దుస్తుల వేసుకుని వచ్చారు.
Also read:
ఆ తరుణంలో విలేకరులు గెటప్ మార్చడం వెనక కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు. ఆ దుస్తులు ధరించడం వెనక స్వామి అగ్నివేశ్ ఉన్నారని ఒక ఉద్యమంలో భాగంగా, అగ్నివేష్ ని ఎన్టీఆర్ ని కలిసారట అగ్నివేష్ ఎప్పుడు కాషాయ దుస్తులు వేసుకునేవారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ ఆయన దుస్తులు వెనుక ఉన్న ప్రత్యేకతల్ని అడిగి తెలుసుకున్నారు. వీటిని వేసుకుంటే స్వార్థం మనలో ఉండదు మన కోసం కాకుండా సమాజం కోసం పనిచేయాలని తపన ఎక్కువ కలుగుతుందని ఎన్టీఆర్ కి చెప్పారు అలా ఎన్టీఆర్ కాషాయ దుస్తులు వేసుకోవడం జరిగింది ఎన్టీఆర్ ప్రజలకి మరింత సేవ చేయాలని ఉద్దేశంతో ఆ దుస్తులు ధరించి ఎనిమిదేళ్లు ప్రజలకి నిస్వార్థ సేవ చేశారు